ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి


Tue,August 20, 2019 01:41 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ / మాక్లూర్ / నందిపేట్ / నందిపేట్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు అందేలా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, నూతన కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని గ్రామ కమిటీల ఎన్నిక బాధ్యులు సూచించారు. ఆర్మూర్ మండలం మిర్ధాపల్లి, గోవింద్‌పేట్ గ్రామాల్లో సోమవారం టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలను, అనుబంధ కమిటీలను ఆ పార్టీ ముఖ్య నాయకులు, కమిటీల ఎన్నిక బాధ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిర్ధాపల్లి టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ఏలేటి భోజన్న, గోవింద్‌పేట్ అధ్యక్షుడిగా అప్పాల గణేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలూర్ టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడి పదవికి పోటీ తీవ్రంగా ఉండడంతో వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా అధికారులతో నిరంతరం మాట్లాడుతూ ప్రజల్లో టీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయలన్నారు. కార్యక్రమాల్లో ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్, ఎంపీపీ పస్క నర్సయ్య, అంకాపూర్ సొసైటీ చైర్మన్ మార గంగారెడ్డి, సర్పంచులు, మాజీ సర్పంచులు బంటు దయానంద్, లింబారెడ్డి, టీసీ సాయన్న, మోహన్, తంబూరి శ్రీనివాస్, ఎంపీటీసీ సురేశ్, నాయకులు మర్కంటి మల్లేశ్, మోతె చిన్నారెడ్డి, ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి, దుమ్మాజీ శ్రీనివాస్, ఎస్పీ నర్సారెడ్డి, సౌడ మధువర్మ, కిశోర్, గంగాధర్, జనార్దన్‌గౌడ్, పోల సుధాకర్, ఇట్టెడి మోహన్‌రెడ్డి, గయాల్ గంగారెడ్డి, దేగాం శ్రీనివాస్‌గౌడ్, అప్పాల సురేశ్‌రెడ్డి, నీరడి ప్రభుదాస్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

మాక్లూర్ మండలంలోని డీకంపల్లి, వెంకటాపూర్, చిక్లీ తదితర గ్రామాల్లో టీఆర్‌ఎస్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీకంపల్లి టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా మచ్చర్ల చిన్నయ్య, వెంకటాపూర్ అధ్యక్షుడిగా రాజేశ్వర్, చిక్లీ అధ్యక్షుడిగా థిమేరి శ్రీకాంత్, వీరితో పాటు మహిళా శాఖ అధ్యక్షురాళ్లుగా బుజ్జమ్మ, లత, లక్ష్మి, రైతుశాఖ అధ్యక్షులుగా జెల్ల గంగాధర్, కాంతారావు, అజార్ జీవన్, యువజన శాఖ అధ్యక్షులుగా ప్రశాంత్, సాయికుమార్, రాము, ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ సెల్ విభాగాలకు కమిటీలను ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, వైస్ ఎంపీపీ సుజాత, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ రజనీష్, విండో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జీవనన్న మండల యువసేన అధ్యక్షుడు రంజిత్, సీనియర్ నాయకులు గుగ్గిలం రాజేశ్వర్‌గౌడ్, సుక్కి సుధాకర్,బోయినపల్లి అశోక్‌రావు, పుల్లయ్యగారి రఘురావు, తొగరి భూషణ్ తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలంచిన్నయానం టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా వేముల దశరత్, గాదేపల్లికి సింగిడి రాములు, డొంకేశ్వర్‌కి గంగసరం సురేశ్, మారంపల్లికి ఎడ్ల రమేశ్, కౌల్‌పూర్ అధ్యక్షుడిగా అలుగు నాగరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉల్లీ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నక్కల భూమేశ్, ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గోజ్జి దేవేందర్, డొంకేశ్వర్ సొసైటీ చైర్మన్ నూత్‌పల్లి భోజారెడ్డి, నాయకులు కేజీ సురేశ్, బాల గంగాధర్, మిట్టాపల్లి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.బాద్గుణ అధ్యక్షుడిగా లోకేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా రంజిత్ ఎన్నుకున్నారు. ఉమ్మెడ, మాయాపూర్ నూతన కమిటీలపై చర్చించి పలు విభాగాలను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నక్కల భూమేశ్, సర్పంచులు రాముడ పోశెట్టి, చిట్టెడి భోజారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మనోజ్‌రావు, నాయకులు సుభాష్ గౌడ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...