అవార్డు అందుకున్న టైపిస్టుకు సన్మానం


Tue,August 20, 2019 01:40 AM

కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ : ఉత్తమ అవార్డు అందుకున్న కమ్మర్‌పల్లి మండల పరిషత్ కార్యాలయం టైపిస్టు శ్రీనివాస్‌ను సోమవారం కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎంపీపీ లోలపు గౌతమి, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొని శ్రీనివాస్‌ను సన్మానించి అభినందించారు. సిబ్బంది ఉత్తమ పని తీరుతో కార్యాలయానికి మంచి పేరు వస్తుందని ఎంపీడీవో అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మైలారం సుధాకర్, సూపరింటెండెంట్ మైలారం గంగాధర్, సీనియర్ అసిస్టెంట్ గంగాధర్, జూనియర్ అసిస్టెంట్ లింగాగౌడ్, టీఆర్‌ఎస్ కమ్మర్‌పల్లి గ్రామ అధ్యక్షుడు సున్నం మోహన్, నాయకులు బద్దం రాజశేఖర్, రెంజర్ల మహేందర్, తీగల హరీశ్, లోలపు సుమన్, చింత గణేశ్, ఎండీ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...