డబుల్ వేగం


Mon,August 19, 2019 03:12 AM

-జిల్లాలో శరవేగంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులు
-నెరవేరుతున్న సొంతింటి కల
-రెండు విడుతల్లో జిల్లాకు 7 వేల 186ఇండ్ల మంజూరు
-హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
బాన్సువాడ, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం గూడు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను జిల్లాలో వేగవంతం చేసింది. ఒక్కో గృహ నిర్మాణానికి 5 లక్షల 4 వేల రూపాయలతో నిర్మి స్తున్నది. దీంతో పాటు రోడ్లు, విద్యుత్తు, తాగునీరు మౌలిక వసతుల కల్పనకు రూ. లక్షా 25 వేలతో రోల్ మోడల్‌గా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు జిల్లాలోని బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో మొదటి రెండో విడత కింద మొత్తం 7,186 ఇండ్లు మంజూరు చేశారు.

శరవేగంగా నిర్మాణ పనులు
కామారెడ్డి జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. రెండు విడతల్లో 7,186 ఇండ్లు మంజూరయ్యాయి. వీటి కోసం 397 కోట్ల 58 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వాటిలో 4896 ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయి. 1672 ఇండ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. 2221 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 113.40 కోట్లు ఇండ్ల నిర్మాణాలకు ఖర్చు చేశారు.

బాన్సువాడ నియోజకవర్గంలో..
జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలు, నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్, కోటగిరి, వర్ని మండలాలతో కలుపుకొని బాన్సువాడ నియోజక వర్గంలో సుమారు నాలుగు వేల ఇండ్లు మంజూరు అయ్యాయి. జిల్లాలో బీర్కూర్ మండలంలోని బైరాపూర్‌గ్రామంలో మొట్ట మొదటగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీ, దాసరి గల్లీ, హరిజనవాడలో, సికిందర్ కాలనీ, మండలంలోని క్రిష్ణానగర్ తండాల్లో ఇండ్లను నిర్మించి పేదలకు అందజేశారు. తాడ్కోల్ శివారులో 25 ఎకరాల్లో 500 ఇండ్లు నిర్మాణాలు పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.

బాన్సువాడ మండలంలోని కృష్ణానగర్ తండా, బాన్సువాడ బీడీ వర్కర్స్ కాలనీ లో 100 ఇండ్లు, వినాయక్ నగర్ లో 25 ఇండ్లు , దళిత వాడలో 25 ఇండ్లు, బీర్కూర్ మండలంలోని బైరాపూర్ లో 50 ఇండ్లు , వర్ని మండలంలోని అక్బర్‌నగర్‌లో 50, కోటగిరి మండలంలోని దోమలెడ్గిలో 50 ఇండ్లు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. అంతే కాకుండా మరో వెయ్యి నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. బాన్సువాడ తాడ్కోల్ శివారులోని 500 ఇండ్లు , బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, బరంగేడ్గి, నస్రుల్లాబాద్ లోని సంగెంతండా, నస్రుల్లాబాద్, వర్ని మండల కేంద్రంలోని 50 ఇండ్లు, తగిలెపల్లి, అంబెం, గోకుల్‌దాస్ తండా, కోటగిరి మండలంలోని హోగ్డోలి, చేతన్‌నగర్,హంగర్గా,తదితర గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయి సెప్టెంబర్ మాసంలో ప్రారంభించనున్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...