సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషి చేయాలి


Mon,August 19, 2019 03:10 AM

నిజామాబాద్ సిటీ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న అని, ఆయన ఆశయ సాధన కోసం గీత కార్మికులు కృషి చేయాలని జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వీజీగౌడ్ అన్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో ఆదివారం సర్దార్ సర్వా యి పాపన్న 369వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వీజీగౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వా యి పాపన్న అంటే ఒక ఉద్యమ ఉగ్రరూపమని అన్నారు. సామాన్య గీత కార్మికుడిగా ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక శక్తిగా ఎదిగాడని కొనియాడారు. కనుమరుగవుతున్న గీతవృత్తికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. ఈత వనాలను పెంచుతూ ప్రభుత్వం తరఫున ఈత మొక్కలను నాటుతున్నారని అన్నారు. 5 కోట్ల ఈత వనాలను నాటి గౌడ కులస్తులను కాపాడాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒక్క ఈత వనంతో 40 లీటర్ల కల్లు వస్తుందని తెలుసుకొని వాటిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. గీత వృత్తికి కార్మికులు, గౌడ కులస్తులు అందరూ కలిసి కట్టుగా ఉంటేనే ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలు పొందుతామని అన్నారు.

కౌండిన్య వంశం నుంచి గౌడ్లు పుట్టారని, గీత వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1991 నుంచి తాను గౌడ సంఘం కన్వీనర్‌గా కొనసాగుతున్నానని ఆ రోజు నుంచి గౌడ కులస్తుల కోసం పోరాడుతున్నానని తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన కల్లు అందించాలంటే ఈత చెట్లు పెట్టాలని సూచించారు. ప్రస్తుతం చెట్లు కనబడటం లేదని, హరితహారం కార్యక్ర మం ప్రారంభమైనందున ఐదేండ్ల కాలంలో 5 కోట్ల చెట్ల ను నాటాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. వాటిని రక్షించుకునే బాధ్యత ఉందని అన్నారు. ప్రభుత్వం గీత కార్మికులకు అండగా ఉంటుందని, సీఎం కేసీఆర్ లైసెన్సు ఐదు సంవత్సరాలు ఉంటే పది సంవత్సరాలు పెంచారని గుర్తు చేశారు. ప్రభుత్వం గీత కార్మికులకు అండగా ఉంటుందన్నారు. గీత కార్మికులకు మరణిస్తే రూ. 5లక్షల ప్రమాద బీమాను వర్తింప జేశారని తెలిపారు. అంగవైకల్యం ఉన్న వారికి సైతం రూ. 5లక్షల ప్రమాద బీమా అందిస్తున్నారని అన్నారు.

టీఎఫ్టీ సొసైటీలుగా మార్చామని, సభ్యులకు పింఛన్ అందిస్తున్నాయన్నారు. గౌడలకు నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అండగా ఉన్నారని అన్నారు. మూతపడిన ఒకటి రెండు సొసైటీలను తెరిపించాలని కవిత సీఎం కేసీఆర్‌కు చెప్పడంతోనే ఆ రెండు సొసైటీలు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లాలో కల్యాణ మండపాల నిర్మాణానికి కోటిన్నర మంజూరు చేశారని, త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని కోకాపేట్‌లోని రూ. 5 కోట్లతో గౌడ వసతి గృహం నిర్మిస్తున్నట్లు చెప్పారు. గీత కార్మికులకు తాను ఎళ్లవేళలా అండగా ఉంటానని, ప్రభుత్వం నుంచి సహా య సహకారాలు అందేలా చూస్తానని తెలిపారు. అనంతరం 30 మంది గౌడ ప్రజాప్రతినిధులకు శాలువ, జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు లావణ్యగౌడ్, రాధాగౌడ్, దశాగౌడ్, సరస్వతీ గౌడ్, రోజా గౌడ్, సృజన గౌడ్, లావణ్య గౌడ్, జలేందర్ గౌడ్, వనజ గౌడ్, మంజుల గౌడ్, గౌడ సంఘం నాయకులు మారయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, చెరుకు లక్ష్మణ్ గౌడ్, రాజాగౌడ్, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...