ప్రభుత్వ పాఠశాలల్లో లిటిల్ టీచర్


Mon,August 19, 2019 03:09 AM

ఇందూరు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆయా సబ్జెక్టులు, పాఠ్యాంశాలపై పూర్తి స్థాయిలో పట్టు పెంచేందుకు గాను లిటిల్ టీచర్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు చేపడుతున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకత నాయకత్వలక్షణాలు పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడనుందని విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ప్రతి తరగతి ప్రారంభమైన ఐదు నిమిషాలు 1 నుంచి పదో తరగతి విద్యార్థులు నిన్న జరిగిన క్లాస్‌ను మళ్లీ బోధించాల్సి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి తరగతిలో విద్యార్థులను భాగస్వామ్యం చేయడంలో భాగంగా విద్యార్థుల క్రమ సంఖ్య(రూల్ నంబరు)ను చిట్టీలపై రాసి ఒక బాక్స్‌లో వేసి అందులోంచి ఒక స్లిప్‌ను తీస్తారు. ఎవరి రూల్‌నంబరు వస్తే ఆ విద్యార్థి పాఠం చెప్పాల్సి ఉంటుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు. ఉపాధ్యాయులు విద్యార్థులు బోధించే పాఠాలను వింటారు. తప్పులేమైనా ఉంటే సరిచేస్తారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. ప్రశ్నించేతత్వాన్ని విద్యార్థులకు అలవరుస్తారు. ఈ ప్రక్రియ ఏడాది పొడవునా పకడ్బందీగా చేపట్టనున్నారు. తద్వారా విద్యార్థులు పాఠాలను శ్రద్ధగా విని, ఏకాగ్రతతో నడుచుకునే వీలుంటుంది. ఈ ప్రక్రియ ఆయా పాఠశాలల్లో తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. లిటిల్ టీచర్ కార్యక్రమంతో ప్రతి పాఠ్యాంశంలో విద్యార్థులు పూర్తి స్థాయిలో పట్టు సాధించే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. విద్యార్థుల్లో పోటీతత్వం ఏర్పడి మంచి ర్యాంకులు సాధిస్తారన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...