ప్రపంచ సదస్సుకు డాక్టర్ విశాల్


Sun,August 18, 2019 12:33 AM

నిజామాబాద్ సిటీ: పోర్చుగల్ రాజధాని లిస్బన్ పట్టణంలో నిర్వహించనున్న ప్రపంచ 19వ మానసిక వైద్యుల వార్షిక సదస్సుకు ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ప్రపంచ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానసిక సమస్యలు, మానసిక వ్యాధులపై నిర్వహించే పరిశోధనలు, నూతన వైద్య చికిత్స విధానాలు అనే అంశాలపై ప్రపంచ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో డాక్టర్ విశాల్ రెండు పరిశోధనలపై ప్రసంగం ఇవ్వనున్నారు. ఇందుకు కృషి చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ దీన్‌దయాల్‌సింగ్, ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్, ఐఎంఏ సభ్యులకు విశాల్ కృతజ్ఞతలు తెలిపారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...