మహిళలు స్వయంసమృద్ధి సాధించాలి


Sun,August 18, 2019 12:33 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : మహిళాసంఘాల సభ్యులు స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకొని స్వయం సమృద్ధి సాధించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఆదముల్ల శైలజ అన్నారు. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మహిళా భవనంలో మహిళా సమాఖ్య సభ్యులకు స్త్రీనిధి రుణాలపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ శైలజ హాజరై మాట్లాడారు. మహిళలు తీసుకున్న రుణాలను సొంత ఖర్చులకు వాడుకోకుండా వ్యాపారాలు చేస్తే కుటుంబాల ఆదాయం పెరుగుతుందన్నారు. మహిళలు, మహిళా గ్రూపులు సంఘటితమై చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలన్నారు. వ్యాపారాలు వృద్ధి చెందడానికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా కావాల్సిన శిక్షణ, రుణ సౌకర్యాలను, మార్కెటింగ్ వసతులను కల్పించడానికి కృషి చేస్తానని కమిషనర్ చెప్పారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు హరితహారంలో భాగంగా కమిషనర్ మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రాజెక్ట్ అధికారి సీహెచ్ రమేశ్, స్త్రీనిధి మేనేజర్ సతీశ్, మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, సీవో రాజలింగం, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు, సభ్యులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...