నేటి నుంచి టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తాం


Sun,August 18, 2019 12:32 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లో టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలను, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌లో శనివారం టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నాయకత్వంలో ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ కమిటీలను, అనుబంధ కమిటీలను వేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీని వేస్తామన్నారు. సమావేశంలో ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్, ఎంపీపీ పస్క నర్సయ్య, అంకాపూర్ సొసైటీ చైర్మన్ మార గంగారెడ్డి, టీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు దేగాం ఇట్టెడి లింగారెడ్డి, కలిగోట్ గంగాధర్, సర్పంచ్ లింబారెడ్డి, ఉపసర్పంచ్ గంగాధర్, నాయకులు రమేశ్, జనార్ధన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి టీఆర్‌ఎస్ గ్రామ కమిటీల ఎన్నికలు
నందిపేట్ రూరల్ : టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకోనున్నట్లు మండలాధ్యక్షుడు నక్కల భూమేశ్ తెలిపారు. టీఆర్‌ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ వ్యవహారాల ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డితో శనివారంప్రత్యేకంగా సమావేశమై గ్రామ కమిటీల ఎన్నికలపై చర్చించినట్లు వివరించారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...