రైతులకు సరిపడా ఎరువులు


Thu,August 15, 2019 03:28 AM

నిజామాబాద్ సిటీ : జిల్లాలో విస్తారంగా వర్షాలు కు రుస్తున్న నేపథ్యంలో ఎరువుల కొనుగోలు హడావు డి మొదలైంది. ప్రస్తుతం సాగు చేస్తున్న వరి, పసు పు, కందులు, సోయా పంటలకు రైతులు యూరి యా అధికంగా వినియోగిస్తున్నారు. డీఏపీ, కాంప్లె క్స్, ఎంవోపీ ఎరువుల విక్రయాలు కూడా జోరందుకున్నాయి. రైతుల అవరసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు డీలర్లు, సొసైటీల ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ఎరువులను సిద్ధం చేసింది. అత్యవసర డిమాం డ్ వస్తే రైతులకు సరఫరా చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. వానాకాలం పంట సీజన్ మొత్తానికి యూరియా 8లక్షల టన్నులు అవసరం కాగా ఈ నెలాఖరు వరకు 7.22లక్షల టన్నుల డిమాండ్ ఉం టుందని అంచనా వేశారు. ప్రస్తుతం 7.50 లక్షల టన్ను ల యూరియా అందుబాటులో ఉంది. మిగిలిన మొ త్తాన్ని అధికారులు తెప్పిస్తున్నారు. సీజన్ మొత్తానికి డీఏపీ 2.50 లక్షల టన్నులు అవసరం ఉంటే, 80వేల టన్నుల ప్రారంభ నిల్వతో కలిపి 2.64లక్షల టన్నులు అందుబాటులో ఉంది. కాంప్లెక్స్ ఎరువులు 3.35 లక్షల టన్నులు అవసరం కాగా 3.62లక్షల టన్ను లు, ఎంవోపి 2.5వేల టన్నులకు గాను 2.2వేల ట న్నులు, ఎస్‌ఎస్‌పీ 600 టన్నులకు గాను 638 టన్నులు ప్రస్తుతం అందుబాటులో ఉంది. మార్క్‌ఫెడ్ వద్ద 12 వేల టన్నుల యూరియా, 2వేల ట న్నుల డీఏపీ, 3వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువుల స్టాక్ ఉంది. దీంతో ఆగస్టు నెల అవసరాలకు సరిపడా అ న్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తు తం వర్షాలు కురుస్తున్నందున్నందున వరి, పసుపు, మొక్కజొన్న తదితర పంటలకు యూరియా విరివిగా వినియోగించనున్నారు. జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో ఎక్కువ ఎరువులను తెప్పిస్తున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...