పంద్రాగస్టు ప్రధాన కార్యక్రమం రద్దు


Thu,August 15, 2019 03:28 AM

బోధన్, నమస్తే తెలంగాణ: పంద్రాగస్టు, రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగే ప్రధాన వేడుకల మాదిరిగానే ప్రతి ఏటా బోధన్‌లోనూ జరుగుతుంటాయి. ఈ వేడుకల ను సెంట్రల్ ఫంక్షన్ పేరిట అధికారులు, స్థానికులు పిలుస్తుంటారు. జిల్లా కేంద్రంలో జరిగే భారీ స్థాయిలో కాకపోయినా.. అదే తరహాలో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్‌లో వేడుకలు నిర్వహిస్తుండడం సంప్రదాయంగా మారింది. అటువంటి సంప్రదాయానికి గురువారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో బ్రేక్ పడనుం ది. పంద్రాగస్టు సెంట్రల్ ఫంక్షన్‌ను నిర్వహించరాదని బోధ న్ అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవం ప్రధాన వేడుకల కోసం జరిగే సన్నాహక సమావేశాలు జరగలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగే సెంట్రల్ ఫంక్షన్ ప్రధాన వేడుకలను ఈసారి నిర్వహించడంలేదని బోధన్ ఆర్డీవో గోపీరాం నమస్తే తెలంగాణకు తెలిపారు.

సెంట్రల్ ఫంక్షన్ వేడుక ఇలా..
పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్ ప్రధాన వేడుకల కోసం ముస్తాబయ్యేది. మువ్వెన్నల జెండాలతో పట్టణంలోని వివిధ పాఠశాలలు నుంచి తరలివచ్చిన విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనే ప్ర జలతో కళకళలాడేది. జిల్లా కేంద్రంలో మాదిరిగానే.. బోధన్ డివిజన్ అధిపతిగా ఉండే సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించేవారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాల ఆవిష్కరణల అనంతరం ఉదయం 9 గంటలకు ఈ సెంట్రల్ ఫంక్షన్ ప్రారంభమయ్యేది. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవో జాతీయ జెండాను ఆవిష్కరించేవారు. అదే పంద్రాగస్టు రోజునైతే మంత్రి లేదా శాసనసభ్యుడు జాతీయ జెండాను ఆవిష్కరించేవారు. వారు హాజరుకాని సందర్భంలో సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవో జాతీయ జెండాను ఆవిష్కరించేవారు. జాతీయ జెండావిష్కరణ అనంతరం పోలీస్ వందనం, మార్చ్‌ఫాస్ట్ గౌరవ వందనం ఉండేవి. ఐదారు గంటలపాటు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులకు విశేషంగా అలరించేవి. డివిజన్‌లోని వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు సబ్ కలెక్టర్, ఆర్డీవో ప్రశంసాపత్రాలు ఇచ్చేవారు. ఇంతకుముందు బోధన్ ఆర్డీవోగా పనిచేసిన శ్యామ్‌ప్రసాద్‌లాల్ ప్రధాన వేడుకల వేదికకు పైకప్పు నిర్మాణం చేయించారు. ఇటువంటి విశిష్టత కలిగిన సెంట్రల్ ఫంక్షన్‌ను ఈసారి రద్దుచేయడంపై పట్టణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. సెంట్రల్ ఫంక్షన్ నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎ టువంటి నిధుల కేటాయింపు లేదు. స్వచ్ఛందంగా ఖర్చులు భరించాల్సి వస్తుందని రెవెన్యూ శాఖ అధికారులు ఇబ్బందులు పడ్డ సందర్భాలు లేకపోలేదు. ఎంతకాదన్నా.. లక్ష రూపాయలకు పైగా ఈ వేడుకల నిర్వహణకు ఖర్చవుతుంది. ఇదే కాకుండా పని ఒత్తిడిలో కూడా ఈ సెంట్రల్ ఫంక్షన్ నిర్వహణ ఇబ్బందిగా ఉంద ని అధికారులు చెబుతున్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...