పంటను పరిశీలించిన పీహెచ్‌డీ విద్యార్థులు


Thu,August 15, 2019 03:28 AM

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : మండలంలోని కమ్మర్‌పల్లి, హాసాకొత్తూర్‌లో సాగవుతున్న సోయా పంటను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయంలో మృత్తిక శాస్త్రంలో పీహెచ్‌డీ, పీజీ చదువుతున్న విద్యార్థులు సందర్శించి పంటను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో సాగు చేస్తున్న సోయా విస్తీర్ణం, దిగుబడిని అంచనా వేయడానికి బాలానగర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, రాజేంద్రనగర్ నీటి సాంకేతిక కేంద్రం సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులు ఈ సందర్శన నిర్వహించారు. సోయా చిక్కుడు పంటను సందర్శించి వివిధ పరికరాలతో, ఉపగ్రహ ఛాయాచిత్రాలతో అనుసంధానం చేయడానికి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. ఈ క్షేత్ర సందర్శనలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ కే.పవన్ చంద్రారెడ్డి, మండల వ్యవసాయాధికారి శ్రీహరి, ఏఈవోలు రాజ్‌కుమార్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...