మొక్కజొన్న, సోయా పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు


Wed,August 14, 2019 01:40 AM

కమ్మర్‌పల్లి, నమస్తేతెలంగాణ/మోర్తాడ్/ఆర్మూర్ రూరల్ : కమ్మర్‌పల్లి మండలంలోని నాగాపూర్‌లో మొక్కజొన్న, సో యా పంటలను మంగళవారం రాజేంద్రనగర్ మొక్క జొన్న పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సందర్శించారు. రాజేంద్రనగ ర్ మొక్కజొన్న పరిశోధనా కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవే త్త డాక్టర్ అనురాధ, ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ మల్లయ్య, డాక్టర్ లవ కుమార్‌రెడ్డి, డాక్టర్ శ్రీలత, డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ నవీన్ కుమార్ పంటలను సందర్శించి రైతులకు సలహాలు, సూచనలు అందజేశారు. నిర వధికంగా కురిసిన వర్షాలతో మొక్కజొన్నలో బ్యాక్టీ రియా కాండం కుళ్లు సోకిందని వారు అన్నారు. కు ళ్లిన కోడి గుడ్ల లాంటి వాసన వస్తుందన్నారు. నివా రణకు వంద కిలోల వేంప పిండలో నాలుగైదు కి లోల బ్లీచింగ్ పౌడర్ కలిపి డ్రైచింగ్ చేయాలన్నా రు. ఆలస్యంగా వేసిన మొక్క జొన్నలో కత్తెర పురు గు ఉదృతి ఎక్కువగా ఉందని గుర్తించారు. నివార ణకు 80 మి.మీ. కొరాజెన్ లేదా 100 మి.మీ. స్పై నటోరమ్ (డెలిగేట్) చొప్పున ఎకరాకు పిచికారి చేసుకోవాలని సూచించారు. లింగాకర్శక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కాండం కుళ్లు తెగులు, ఎండు తెగులుని వారణకు సాల్ల పద్ధతిలో మొక్క జొన్న విత్తుకోవాలని, పంట మార్పిడి పద్ధతి పాటించాలని సూచించారు. ఎంఏవో శ్రీహరి, వీడీసీ అధ్య క్షుడు కిరణ్, ఏఈవో రాజ్ కుమార్, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

మొక్కజొన్న పంటకు సర్ఫ్‌నీటిని వాడొద్దు..
మొక్కజొన్న పంటలో కత్తెరపురుగు నివారణకు సర్ఫ్‌నీటిని ఉపయోగించాలని సామాజిక మాధ్యమాల్లో రావడాన్ని చూసి కొంతమంది రైతులు అదే పద్ధతిని పాటిస్తున్నారని, దీంతో ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా పంట నష్టపో వాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు నవీన్, అనురాధ, లవకుమార్‌రెడ్డి, శ్రీలత, మల్లయ్య, బల రాంలు సూచించారు. దొన్కల్‌లో సర్ఫ్‌నీటిని విని యోగించి న మొక్కజొన్న పంటలను శాస్త్రవేత్తలు మంగళవారం పరి శీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశా రు. వ్యవసాయాధికారి లావణ్య, ఏఈవోలు రంజిత్, మోహ న్ పాల్గొన్నారు. ఆర్మూర్ రూరల్ మండలంలోని గగ్గుపల్లి గ్రామంలో మంగళవారం మొక్కజొన్న పంటను పరిశీలించా రు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మొక్కజొన్న పంటలో కత్తెర పురుగుఉత్పత్తిని ఎక్కువగా గుర్తించి, నివార ణ చర్యలు చేపట్టాల్సిందిగా రైతులకు సూచించారు. కత్తెర పురుగు నివారణకు విషపు ఎరను (బెల్లం 2కేజీ,+ తవుడు 5కేజీ+సైనోపాడీ పురుగుల మందు) తయారు చేసుకొని పైరులో చల్లుకోవాల్సిందిగా సూచించారు. మొక్కజొన్న పరి శోదన కేంద్రం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యా లయం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ అనురాధ, డాక్టర్ లవకు మార్ రెడ్డి, శ్రీలత, మల్లయ్య, ఏరువాక శాస్త్ర వేత్త నిజామా బాద్ నవీణ్ కుమార్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోదన కేం ద్రం జగిత్యాల శాస్త్రవేత్త బలరాం, మండల వ్యవసాయ అ ధికారి హరికృష్ణ, రైతు సమన్వయ కమిటీ గ్రామ కో ఆర్డినే టర్ భూగొళ్ల ప్రదీప్, ఏఈవోలు వసుందాం, నరేశ్, రైతులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...