కేసీఆర్‌కు రైతులు, పేదలు రెండు కండ్లు


Wed,August 14, 2019 01:40 AM

మెండోరా : ఈ ప్రాంత రైతుల ఇబ్బందులు వివరించడంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పరిగణించి బుస్సాపూర్, మోతె, మానాలకు ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్)ను మంజూరు చేశారని రాష్ట్ర రోడ్లు భవనాలు, రవాణా, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖల మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెండోరా మండలం బుస్సాపూర్‌లో నూతనంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని, చాకిర్యాల్‌లో గ్రామ పంచాయతీ కార్యాలయం భవనాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సహకార సంఘాలు రైతు సేవలకు వేదికలుగా, రైతుల అభివృద్ధికి అండగా నిలిచేవిగా ఉండాలని పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన మెండోరా మండలంలో బుస్సాపూర్ వేంపల్లి సొసైటీలో, దూదిగాం, సోన్‌పేట్ సావెల్ సొసైటీలో ఉండడంతో రైతులకు దూరభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మోతె, అక్లూర్ గ్రామాలు భీమ్‌గల్ సొసైటీలో ఉండడంతో ఇదే రకమైన ఇబ్బందులు రైతులు ఎదుర్కొన్నారన్నారు. నియోజకవర్గంలోని మానాల గ్రామం 16 తండాలతో కొనసాగి, కొత్తగా 8 గ్రామ పంచాయతీలుగా ఏర్పడిందన్నారు. గిరిజన రైతులతో కూడిన ఇన్ని గ్రామపంచాయతీల రైతులకు ప్రత్యేక సొసైటీ ఏర్పాటు డిమాం డ్ ఎంతో కాలంగా ఉందన్నారు. ఈ మూడు సొసైటీల ఆవశ్యకతను, ఇక్కడి రైతుల ఇబ్బందులను సీఎం కేసీఆర్‌కు విన్నవించానన్నారు. తన వినతిని పరిశీలించి, ప్రత్యేకంగా పరిగణించి సీఎం కొత్తగా ఈ మూడు సొసైటీలు మంజూరు చేశారని తెలిపారు. కొత్త సొసైటీల మంజూరులో తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి మిత్రుడైన వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి సహకారం అందించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. తన తండ్రి సురేందర్‌రెడ్డి 25 ఏండ్ల పాటు సొసైటీ చైర్మన్‌గా పనిచేశారన్నారు. ఈ సమయంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ద్వారా ప్రయోజనాలను, తన తండ్రి సురేందర్‌రెడ్డి పీఏసీఎస్ చైర్మన్‌గా అందించిన సేవలను దగ్గరగా చూశానని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు రైతులు,పేద ప్రజలు రెండు కండ్లు అన్నారు. ఎల్లప్పుడు ఆయన వారి క్షేమం కోరుకుంటారని తెలిపారు. రైతాంగ సంక్షేమానికి రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందన్నా రు. అతి త్వరలో ఎస్సారెస్పీలోకి కాళేశ్వరం నీరు వస్తాయన్నారు. ఆ అద్భుతమైన దృష్యాన్ని చూడాలని తాను, రైతుల ఎదురు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. సొసైటీల అభివృద్ధికి రైతులు సహకరించాలని , కొత్త సొసైటీలు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...