మోతెలో పద్ధతి ప్రకారం అభివృద్ధి పనులు


Wed,August 14, 2019 01:40 AM

వేల్పూర్ : తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మోతె గ్రామంలో సహకార సంఘం ఏర్పాటు చరిత్రాత్మక నిర్ణయమని, మోతె గ్రామంలో అభివృ ద్ధి పనులు ఒక పద్ధ్దతి ప్రకారం ముందకు సాగుతున్నాయని, డబుల్ బెడ్ రూం పనులు త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రె డ్డి అన్నారు. మండలంలోని మోతెలో ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసిన సొసైటీని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో అనేక గ్రామాల్లో సొసైటీలు ఏర్పాటు చేయాలని అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, అయినప్పటికీ నియోజకవర్గంలో మూడు కొత్త సొసైటీలు ఏర్పాటుకు సీఎం అనుమతి ఇచ్చారన్నారు.తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మోతె గ్రామంలో ప్ర త్యేక సొసైటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు అడిగిన వెంటనే మంజూ రు చేయడంపై మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని ప్రారంభించిన సొసైటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు. మాటు కాలువ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని, మాటు కాలువ ద్వారా మో తె గ్రామంలోని చెరువులను త్వరలో నింపుతామని తెలిపారు. మాటు కాలు వ పనులు సెప్టెంబర్ వరకు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించామని, వర్షాలు కారణంగా పనులకు ఆటంకం కలుగుతుందని కాంట్రాక్టర్ తనకు తెలిపాడని మంత్రి గ్రామస్తులకు వివరించారు. అనంతరం సొసైటీ ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు.

సొసైటీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు : డీసీసీబీ చైర్మన్
జిల్లాలో సొసైటీల ద్వారా ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ పట్వారీ గంగాధర్ కోరారు. రాష్ట్రంలో నల్గొండ తర్వాత నిజామాబాద్ జిల్లాలోనే అత్యధిక లాభాలతో కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాల్లో 142 సొసైటీలు పనిచేస్తున్నాయని, కొత్త వాటితో కలిపి సంఖ్య 144 చేరిందన్నారు. డీసీవో సింహాచలం, ఎంపీపీ భీమ జము, జడ్పీటీసీ భారతి, మోతె, అక్లూర్ సర్పంచులు రజిత, జైడి చిన్నవ్య, ఎంపీటీసీ డోళ్ల సత్తెవ్య, ఉప సర్పంచ్ రాజేశ్, మాజీ సొసైటీ చైర్మన్ సామ గంగారెడ్డి, పాలెపు బాలరాజు, డోళ్ల రాజేశ్వర్, చంద్రమోహన్‌గౌడ్, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...