మహిళల భద్రత కోసమే షీ-టీమ్‌లు


Wed,August 14, 2019 01:39 AM

నిజామాబాద్ క్రైం : మహిళల భద్రత కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మహిళా కళాశాలలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, చౌరస్తా, ఎగ్జిబిషన్, దేవాలయాల్లో షీ టీమ్ బృందాలు ప్రచారం చేస్తున్నాయని సీపీ కార్తికేయ వెల్లడించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో సీపీ కరపత్రాలు, స్టిక్కర్లను ఆ విష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు షీటీమ్ కరపత్రాల పంపిణీ, స్టికర్ల ద్వారా ప్రచారం చేస్తామన్నారు. మహిళల భద్రత కోసమే షీ టీమ్ ఏర్పాటు చేశామన్నారు. ఆటోల్లో, ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న సమయంలో ఎవరైనా వేధిస్తే సమాచారం ఇవ్వ డానికి ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లతో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్, జీ మెయిల్‌ను అందుబాటులో ఉంచామన్నా రు. డయల్-100, [email protected] gma il.com, ఫేస్ బుక్ ఐడీ sheteam.nizamabad ట్విట్టర్ అకౌంట్ cp-nizamabad, వాట్సప్ నంబర్ 94906 18029కు దేనికైనా సమాచారం ఇవ్వవచ్చన్నా రు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉం చుతామన్నారు. కళాశాల విద్యార్థులను వేధిస్తే, లెక్చరర్లు ఈవ్‌టీజింగ్ చేసినా షీటీమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కరపత్రాలను ప్రజల అవగాహన కోసం జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఇస్తామని తెలిపా రు. స్టికర్లు మార్కెట్ ఏరియాలు, జనరద్దీ ప్రదేశాల్లో అంటిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎం.శ్రీధర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రావు, ఎస్బీఐ మధుసూదన్, నగర సీఐ జి.నరేశ్ పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...