వారం రోజుల్లో ఎస్సారెస్పీకి.. కాళేశ్వరం జలాలు


Tue,August 13, 2019 02:29 AM

-తీరనున్న రైతుల చిరకాల వాంఛ
-ప్రజల ఆకాంక్షలను సాధ్యం చేసిన సీఎం కేసీఆర్
-రాష్ట్ర ఆర్‌అండ్‌బీ, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి: రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్న చిరకాల వాంఛ వారం రోజుల్లో తీరబోతున్నదని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, ఆర్‌అండ్‌బీ, రవాణా, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన బాల్కొండ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వారం రోజుల్లో కాళేశ్వరం జలాలను శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించడం ప్రారంభమవుతుందన్నారు. ఈ పునరుజ్జీవ పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించామని, ఇందుకు ఆయన అంగీకరించారన్నారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే ఈ పునరుజ్జీవ పథకం ఫలాలు అందించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం రైతులపై ప్రేమను, చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ప్రజల అవసరాలను, రైతుల ఆకాంక్షలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్‌కు సాటిలేరన్నారు. పథకం ప్రారంభోత్సవానికి పదివేల మంది రైతులు ఇక్కడి నుంచి తరలివచ్చే అవకాశం ఉందన్నారు. కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీలో పడితే మొదట బతికేది నిజామాబాద్ జిల్లానే అని అన్నారు. ఇక జలజగడాలు శాశ్వతంగా తీరిపోతాయని చెప్పారు.- నిజామాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి

వారం రోజుల్లో కాళేశ్వరం జలాలను శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించడం ప్రారంభమవుతుందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. బాల్కొండ మం డల కేంద్రంలో సోమవారం ఆ యన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మా ట్లాడారు. కేవలం వారం రోజుల్లో కాళేశ్వరం జ లాలు పునరుజ్జీవం పథకం ద్వారా దిగువ నుంచి ఎగువకు ప్రవహిస్తూ ఎస్సారెస్పీలోకి చేరడం ప్రారంభమవుతుందన్నారు. చాలా మంది దిగువ నుంచి ఎగువకు ఎస్సారెస్పీకి నీరు వస్తుందంటే నమ్మలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ నిజం చేసి చూపించబోతున్నారన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుందన్నారు. ఈ పునరుజ్జీవ పథకాన్ని ప్రారంభించాలని సీఎంకు విన్నవించగా, ఇందుకు ఆయన అంగీకరించి పథకాన్ని ప్రారంభించడానికి వస్తున్నారని తెలిపారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే ఈ పునరుజ్జీవ పథకం ఫలాలు అందించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం రైతులపై ప్రేమను, చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్, రైతుబంధు, రైతుబీమా తదితర గొప్ప పథకాలు సాధ్యం కావని ఎందరో అన్నాగాని కేసీఆర్ చేసి చూపించారని గుర్తు చేశారు. ఇరవై ఏం డ్లుగా వట్టిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోసి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల ఆయకట్టు రైతులకు వరంలా పునరుజ్జీవ పథకాన్ని సీఎం కేసీఆర్ అం దించారని తెలిపారు.

వారం రోజుల్లో నీళ్లు ఎగువకు ప్రవహిస్తూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరే అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుందన్నారు. పునరుజ్జీవ పథకం ప్రారంభోత్సవానికి పదివేల మంది రైతులు తరలివచ్చే అవకాశం ఉందన్నా రు. కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీలో పడితే మొ దట బతికేది నిజామాబాద్ జిల్లానే అని అన్నారు. ఇక జల జగడాలు శాశ్వతంగా తీరిపోతాయన్నా రు. పునరుజ్జీవ పథకంతో ఎస్సారెస్పీని నింపుకోవడం ద్వారా అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలను, చౌట్‌పల్లి, నవాబు, వేంపల్లి, బోదేపల్లి, లక్ష్మి తదితర ఎత్తిపోతల పథకాలన్నింటినీ కావాల్సినన్ని రోజులు నడుపుకోబోతున్నామన్నారు. వరద కాలువ ఎడమ వైపు రూ. 10 కోట్లతో తూ ముల నిర్మాణం జరుగుతుందన్నారు. దీంతో ఆ పక్క ఉన్న చెరువులన్నింటికీ నీటికి ఢోకా లేకుం డా పోతుందన్నారు. వరద కాలువ కుడివైపున అ వసరమైన చోట మోటార్ల ద్వారా నీటిని అందించుకోగలుగుతామన్నారు. ఏడాదిలోగా ప్యాకేజీ -21 పనులను పూర్తి చేసి నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో సాగునీరు అందుతుందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అ న్ని గ్రామాలకు సాగునీరు అందే రోజులు వచ్చాయన్నారు. పునరుజ్జీవ పథకం ఫలాలు అందనుండడంతో తన జన్మ ధన్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు, రైతుల తరపున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కేసీఆర్ అమలు చేసిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. పలు రాష్ర్టాలు ఈ పథకాల అమలుకు కృషి చేస్తున్నాయన్నారు. మిషన్ భగీరథ పూర్తితో ప్రధాని మోదీ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారని తెలిపారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...