వంట గ్యాస్ లీక్‌తో కాలిన వస్తువులు


Tue,August 13, 2019 02:25 AM

శక్కర్‌నగర్: బోధన్ పట్టణంలోని ఓ ఇంట్లో సోమవారం వంటగ్యాస్ లీకై మంటలు అంటుకున్నాయి. గమనించిన కుటుంబీకులు స్థానికుల సహకారంతో మంటలు ఆర్పారు. ఈ నెల 13 సరస్వతీ నగర్‌లోని విజయ అనే మహిళ ఇంట్లో నిర్వహించాల్సిన విందుకు గాను వంటలు చేసేందుకు గ్యాస్‌ను వినియోగించారు. వంట చేసిన వ్యక్తులు గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ను సక్రమంగా బిగించకపోవడంతో గ్యాస్ లీకయి, పక్కనే పూజగదిలో ఉన్న దీపం కారణంగా మంటలు వ్యాపించాయి. పరిస్థితి వెంటనే గుర్తించిన సదరు ఇంటి యజమానులు మంటలు ఆర్పారు. సమాచారం మేరకు పోలీసులు విచారణ జరిపారు. ఈ విషయంపై బోధన్ పట్టణ సీఐ నాగార్జునగౌడ్‌ను వివరణ కోరగా తమకు బాధితురాలు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...