తండ్రిని చంపిన తనయుడు


Tue,August 13, 2019 02:24 AM

ఆర్మూర్ రూరల్ : మండలంలోని రాంపూర్‌లో సోమవారం సాయంత్రం డబ్బులకోసం తండ్రిని కుమారుడు హత్య చేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శేషాద్రి(47) ఉపాధి కోసం కుమారుడు సురేశ్‌తో కలిసి ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామానికి నెల క్రితం వలస వచ్చాడు. శేషాద్రి భార్య కొన్ని రోజుల క్రితం మృతి చెందింది. తండ్రీ కొడుకులు రాంపూర్‌లోని వెంకటేశ్వర్లుకు చెందిన ఇటుక బట్టీలో కూలీలుగా పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి తండ్రీ కొడుకుల మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం పని ముగిసిన అనంతరం ఇటుక బట్టీ వద్ద మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగగా సురేశ్ ఆగ్రహంతో తండ్రిని విచక్షణారహితంగా కర్రతో కొట్టాడు.

దీంతో శేషాద్రి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి ఏసీపీ అందె రాములు, ఎస్‌హెచ్‌వో రాఘవేందర్, ఎస్సై యాదగిరిగౌడ్ చేరుకుని పరిశీలించారు. హత్యకు గల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరారీలో ఉన్న సురేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...