ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు


Tue,August 13, 2019 02:24 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ / మాక్లూర్ / నందిపేట్ / నందిపేట్ రూరల్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్, ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లో సోమవారం బక్రీద్ పర్వదిన వేడుకలను ముస్లిములు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆర్మూర్ పట్టణం, మామిడిపల్లి, చేపూర్, పెర్కిట్‌లోని ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఈద్గా వద్దకు టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చి మైనార్టీ నాయకులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మాక్లూర్‌లో కోఆప్షన్ సభ్యుడు హైమద్, టీఆర్‌ఎస్ నాయకులు కరీం, అబ్దుల్ రహ్మన్, హబీబ్, హుస్సేన్, నజీర్, మైమూద్, మైబూబ్ తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...