సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు


Tue,August 13, 2019 02:23 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామాలయం, దుర్గామాత ఆలయంలో పండితుడు కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా గుట్టకు సుమారు రెండు వేల మంది వరకు భక్తులు తరలివచ్చారు. రామ నామ స్మరణతో పల్లకీ సేవ నిర్వహించారు. పట్టణంలోని ఎల్‌కే దవాఖాన డాక్టర్ అశోక్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి శివాలయంలో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి, సుమన్, పీసీ గంగారెడ్డి,కిషన్, బోండ్ల ఆనంద్, నికిల్, రాజేందర్, మధు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...