గంగపుత్రుల అభ్యున్నతికి కృషి చేస్తా


Tue,August 13, 2019 02:23 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : నియోజకవర్గంలోని గంగపుత్రుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌కు చెందిన గంగపుత్ర సంఘం నాయకులు సోమవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని కలిశారు. ఆర్మూర్ గంగామాత గంగపుత్ర సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేని కోరారు. నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేని గంగపుత్ర సంఘం సభ్యులు సన్మానించారు. హైదరాబాద్ వెళ్లిన వారిలో టీఆర్‌ఎస్ నాయకుడు లోక ముత్యంరెడ్డి, గంగపుత్ర సంఘం ఆర్మూర్ అధ్యక్షుడు లింగం, ఉపాధ్యక్షుడు బింగి పెంటయ్య, కార్యదర్శి రాజేశ్వర్, కోశాధికారి గంగాధర్ తదితరులు ఉన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...