వేగంగా ఆధునీకరణ


Mon,August 12, 2019 02:01 AM

రూ.8 కోట్లతో కాలువలకు సీసీ లైనింగ్
-పూర్తి కావస్తున్న నవాబ్ కాలువ సీసీ పనులు
-కాలువలు ఏర్పడిన నుంచి ఇదే మొదటిసారి
-మంత్రి సహకారంతో చివరి ఆయకట్టు వరకు నీరు
-హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
వేల్పూర్ : నవాబు కాలువలు ఆధునీకరణతో నవాబులా మారుతున్నాయి. రైతును నవాబును చేసే కెనాల్ ఆధునీకరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రూ.8 కోట్లతో చేపట్టిన ఈ పనులు పూర్తి కావస్తున్నాయి. చివరి ఆయకట్టుకు నీరందించే నిజాంసాగర్ కాలువలు, నవాబ్ ఎత్తిపోతల కాలువలు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి మరమ్మతులు నోచుకోలేదు. కాలువలు ధ్వంసమై చెరువులు నీరు చేరే వీలు లేకుండా మారిపోయాయి. ఆ కాస్త వచ్చే నీటి కోసం రైతులు కాలువల వెంట రాత్రుళ్లు పడి గాపులు కాసేవారు. దుస్థితిని గుర్తించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాలువల ఆధునీకరణ కోసం రూ. 8 కోట్లు మంజూరు చేయించారు. ఈ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వేగంగా పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాలువలకు సీసీ లైనింగ్ పనులు వేగంగా కొనసాగడంతో మండలంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీటి పనులు దగ్గరుండి చేయించుకోవాలని మంత్రి ఆయా గ్రామాల రైతులకు సూచించడంతో గ్రామకమిటీల సభ్యులు, రైతులు నాణ్యతో పనులు చేయించుకుంటున్నారు. నవాబ్ లిఫ్ట్ నుంచి ఆయా గ్రామాలకు ఇదివరకు ఉన్న కాలువలు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ధ్వంసం కావడంతో ఇబ్బందులు పడ్డారు. వాటిని పూర్తిగా తీసివేసి కొత్త కాలువలు నిర్మిస్తున్నారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా చివరి ఆయకట్టు వరకు నీరు అందించడానికి ప్రణాళికగా ముందుకు కొనసాగాలని మంత్రి ఇదివరకే ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి రోజు అధికారులు పనులను పరిశీలిస్తున్నారు. గతంలో కెనాల్ పనులకు నిధులు మంజూరు చేయాలని ఈ ప్రాంత రైతులు నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నవాబ్ కెనాల్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేయించాలని ఈ ప్రాంత రైతులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి విన్నపించడంతో నవాబ్ కెనాల్ ఆధునీకరణకు రూ.11కోట్ల నిధులు మంజూరు చేయించారు. నవాబ్ లిఫ్ట్ పరిధిలోని లక్కోర, పడగల్, అమీనాపూర్, వేల్పూర్, కుకునూర్, కోమన్‌పల్లి, వెంకటాపూర్, సాహెబ్‌పేట్, అంక్సాపూర్, మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామాల చెరువులకు నవాబ్ లిఫ్ట్ కాలువల ద్వారా నీరు చేరుకుంటుంది.

కాలువలు సక్రమంగా లేక నీరు ఆశించిన స్థాయిలో చెరువులకు అందలేదు. ఫీడర్ ఛానళ్లు సరిగాలేక పోవడంతో నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. గతంలో లిఫ్ట్ ద్వారా నీరు విడుదలైనప్పటికీ చివరి ఆయకట్టు వరకు నీరు రావడానికి రైతులు వంతుల వారీగా కాలువల వెంట ఉండే పరిస్థితి ఉండేది. మండలంలో బోరు బావులపై ఆధారపడ్డ రైతులు అధికంగా ఉన్నారు. చెరువుల్లో నీరు ఉంటేనే బోరు బావుల ద్వారా పంట పోలాలకు నీరు అందుతుంది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేయించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి రైతులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...