కొనసాగుతున్న రైతుల రిలే దీక్షలు


Mon,August 12, 2019 01:58 AM

రెంజల్ : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం వద్ద కందకుర్తి రైతులు చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారం నాటికి ఐదోరోజుకు చేరుకున్నాయి. వారు మాట్లాడుతూ పంట సాగులో ఉన్న 308 ఎకరాల 30 గుంటల భూములకు సంబంధించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందించాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా అధికారులు కనికరం చూపడంలేదని అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. కార్యాలయం వద్ద మోకాలిపై నిలబడి చేపట్టిన రిలే దీక్షలకు పలువురు నాయకులు మద్దతు తెలిపారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...