ఐరన్ పోల్స్ తొలగించాలి


Mon,August 12, 2019 01:57 AM

ఆర్మూర్ రూరల్: పవర్ వీక్ ప్రోగ్రాంలో భాగంగా మండలంలోని దేగాం గ్రామాన్ని విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుదర్శన్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సెక్షన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రా మంలో నెలకొన్న విద్యుత్తు సమస్యలను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. వంగిపోయిన ఐరన్ పోల్స్ తొలగించి అవసరం ఉన్న చోట కొ త్తవి ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సెక్షన్ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున నూతన భవనం మంజూరు చేశారు. కార్యక్రమంలో డీఈ ఈ రమేశ్, ఏఈ నటరాజ్, దేగాం, మంథని, మ చ్చర్ల సర్పంచులు సరోజ, లింబారెడ్డి, నర్సయ్య, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ముత్యం రెడ్డి, గ్రామ కమిటీ సభ్యులు, సిబ్బంది, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...