విద్యుత్తు సమస్యలను పరిష్కరిస్తాం


Mon,August 12, 2019 01:57 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ: గ్రామాల్లో విద్యుత్తు సమస్యలను పరిష్కరిస్తామని ఎస్‌ఈ సుదర్శన్ అన్నారు. మండలంలోని సుద్దులంలో విద్యుత్ స్తంభాలు, కరెంటు తీగలు వేలాడుతున్నాయని సర్పంచ్ వెంకటేశ్ విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఎస్‌ఈ గ్రామాన్ని సందర్శించారు. పవర్‌వీక్ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న స్థంభాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలను పునరుద్ధరించే బాధ్యతలు త్వరలోనే చేపడుతామని అన్నారు. గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లకు వస్తున్న కరెంటును వాటి నుంచి గృహాలకు వెళ్తున్న కరెంటును పరిశీలించారు. అనంతరం ఎస్‌ఈని గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో ఏఈ గోపి, లైన్‌మెన్లు చంద్రశేఖర్, నర్సింహులు, జేఎల్‌ఎం పీర్‌సింగ్, వీడీసీ సభ్యులు రాజారెడ్డి, కృష్ణారెడ్డి, రవి, మహిపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...