ప్రభుత్వ దవాఖానలో పండ్ల పంపిణీ


Mon,August 12, 2019 01:57 AM

ఆర్మూర్ రూరల్ : పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుడు రాజు పుట్టిన రోజు సందర్భంగా స్థానిక ప్రభుత్వ దవాఖానలో బాలింతలకు, రోగులకు ఆదివారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షుడు రాజేశ్ మాట్లాడుతూ లయన్స్ సభ్యులు వారి జన్మదిన, పెండ్లి రోజు, పిల్లల జన్మదిన వేడుకలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలందిస్తూ, వారి మన్నలను పొందుతున్నామన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి గణేశ్, కోశాధికారి ప్రతాప్, సభ్యులు దాషెట్టి నీరజ్, బారడ్, ప్రవీణ్, కలిగోట చిన్నా తదితరులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...