సీఎం సహాయనిధి చెక్కు అందజేత


Mon,August 12, 2019 01:57 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : పట్టణానికి చెందిన అపర్ణకు మంజూరైన రూ.14 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును టీఆర్‌ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనారోగ్యంతో ఉన్న పేదవారిని సీఎం సహాయనిధితో ఆదుకునే ఆలోచనతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ఏర్పాటు చేశాడని అన్నారు. సీఎంఆర్‌ఎఫ్ మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి లబ్ధిదారు కృజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ లింగాగౌడ్, సిద్దుల గుట్ట చైర్మన్ ఏనుగు శేఖర్, మాజీ కౌన్సిలర్లు ఖాందేశ్ సంగీత శ్రీనివాస్, రమాకాంత్, కోఆప్షన్ మెంబర్ పోల మధుకర్, మైనార్టీ నాయకులు ఉస్మాన్, టీఆర్‌ఎస్ నాయకులు రమేశ్, రంజిత్, ఇఫ్తక్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...