బాధిత కుటుంబాలకు రాజేశ్వర్‌రెడ్డి పరామర్శ


Mon,August 12, 2019 01:56 AM

ఆర్మూర్, నమస్తే తెలంగాణ : ఆర్మూర్ పట్టణంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న పలువురు కుటుంబాల సభ్యులను ఆదివారం టీఆర్‌ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. టీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడు షఫీయోద్దీన్ అనారోగ్యంతో దవాఖానలో పొందుతుండగా అక్కడికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మాజీ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మాలిక్‌బాబా తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా వారి ఇంటికి వెళ్లి రాజేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. అంతకుముందు టీఆర్‌ఎస్ యువ నాయకుడు మీరా శ్రావణ్ చెల్లెలు ఆనారోగ్యంతో ఉండడంతో ఇంటికి వెళ్లి రాజేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. రాజేశ్వర్‌రెడ్డి వెంట టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఖాందేశ్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ లింగాగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...