ఇచ్చిన మాటకు కిషన్‌రెడ్డి కట్టుబడి ఉండాలి


Sun,August 11, 2019 05:10 AM

-ఎస్సీ కార్పొరేషన్ మాజీచైర్మన్ పిడమర్తి
తార్నాక: బీజేపీ అధికారంలోకొచ్చిన వందరోజులకే ఏబీసీడీ వర్గీకరణ బిల్లును తెస్తామని చెప్పిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని, ఏబీసీడీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శనివారం తార్నాకలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాం గ్రెస్, బీజేపీలు మాదిగ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి తీరుతామని చెప్పుకొన్న బీజేపీ ఇప్పుడు మాటపై నిలబడాలన్నారు. 25 ఏళ్ల నుంచి సుదీర్ఘంగా పోరాటం సాగుతున్న ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈనెల 16న హైదరాబాద్‌లో మాదిగల సన్నాహకసభ జరుగుతుందన్నారు. ఈ సభలో సీనియర్ నాయకులను ఏకంచేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నామన్నారు. సమావేశంలో ఇటిక రాజుమాదిగ, యాతాకుల భాస్కర్, మాదిగ జేఎసీ నాయకులు తదితరులు ఉన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...