పసుపు రైతుల సమస్యలు కేంద్రానికి నివేదిస్తా


Sun,August 11, 2019 01:06 AM

-కేంద్ర ఉద్యానవన కమిషనర్ బీఎస్‌ఎన్ మూర్తి
-ఆర్మూరు, కమ్మర్‌పల్లిలో పర్యటన
కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : తమ సమస్యలు పరిష్కారం కావడానికి పసుపు రైతులు తెలిపిన అభిప్రాయాలను కేంద్ర వ్యవసాయ శాఖకు నివేదిస్తానని కేంద్ర ఉద్యానశాఖ కమిషనర్ బీఎస్‌ఎన్ మూర్తి అన్నారు. కమ్మర్‌పల్లి పసుపు పరిశోధనా స్థానంలో శనివారం ఆయన పసుపు రైతులతో సమావేశమయ్యారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారానికి వారు తెలిపే అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఆయన ఈ సమావేశంలో రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రాంరెడ్డితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు మార్కెటింగ్, ధర, తదితర సమస్యలు గుర్తించి పరిష్కరించే ప్రయత్నం చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. కేంద్రం నుంచి పసుపు రైతులకు ఏ విధమైన సహకారం కావాలనేది గుర్తించి తగు చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామన్నారు.

8 శాతం పసుపే తెలంగాణలో వినియోగం: రాష్ట్ర కమిషనర్
తెలంగాణలో ఏటా సాగయ్యే పసుపులో రాష్ట్రంలో వినియోగమవుతున్నది కేవలం ఎనిమిది శాతమేనని రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రాంరెడ్డి అన్నారు. మిగతా 92శాతం పసుపును ఏం చేయాలి, ఏం చేస్తే రైతుకు లాభం కలుగుతుందనేది రైతుల అభిప్రాయంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. రాష్ట్రంలో చింతపండు, వెలుల్లి, జీర, అల్లం, ధనియాలు, కొత్తమీర లాంటి వాటికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పి రైతు లు పండించిన ధాన్యానికి ధర వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్‌దాస్, డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ భగవాన్, టీఎస్ హెచ్‌డీసీఎల్ జీఎంలు బాబు, సుభాషిణి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ మధుసూదన్, పసుపు పరిశోధనా స్థానం సీనియర్ సైంటిస్టు మహేందర్‌రెడ్డి, ఏరువాక కేంద్రం రిటైర్డు కోఆర్డినేటర్ కిషన్‌రెడ్డి, హార్టికల్చర్ అధికారులు మహేశ్, రోహిత్, సుమన్, హెచ్‌ఈవోలు సునీల్, తదితరులు పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...