జేబు దొంగ పట్టివేత


Sun,August 11, 2019 01:04 AM

రెంజల్: మండలంలోని సాటాపూర్ వారాంతపు సంతలో ఓ వ్యాపారి జేబులోంచి నిందితుడు డబ్బులను దొంగిలిస్తుండగా గమనించిన ఇతర వ్యాపారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారాంతపు సంతకు క్రయవిక్రయాల కోసం వచ్చే వ్యాపారులతో రద్దీగా ఉండే ప్రాంతంలో జిల్లా కేంద్రానికి చెందిన నిందితుడు దొంగతనానికి యత్నించాడు. గ్రామ పంచాయతీ భవనం వద్ద సంతలో విక్రయించే వ్యాపారులు రశీదు పొందేందుకు నిల్చున్న ఓ వ్యాపారి జేబు నుంచి డబ్బు దొంగిలిస్తుండగా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...