రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి


Sun,August 11, 2019 01:03 AM

మెండోరా (ముప్కాల్): ముప్కాల్ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలైనట్లు ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి తెలిపారు. ఘటనకు సంబంధించి ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మతిస్థిమితంగా లేని వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైక్‌పై హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు వెళ్తున్న సందీప్, నవీన్ ఢీ కొట్టారు. ఈ ఘటనలో మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందగా బైక్‌పై ఉన్న సందీప్‌కు స్వల్ప గాయాలు కాగా నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...