టీకా వికటించి చిన్నారి మృతి మోపాల్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం శ్రీర�


Sun,August 11, 2019 01:03 AM

మోపాల్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం శ్రీరాంనగర్ గ్రామం శివలాల్ తండాలో శనివారం టీకా వికటించి మూడు నెలల చిన్నారి మృత్యువాత పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. శివలాల్ తండాకు చెందిన అరుణ, హనుమాన్‌సింగ్ దంపతులకు మూడు నెలల కిందట పాప జన్మించింది. ముదక్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నెలవారీ టీకాలు ఇచ్చేందుకు శనివారం తండాకు వచ్చారు. వారు ఒక వ్యాక్సిన్ బాటిల్ నుంచి ఏడుగురు చిన్నారులకు టీకాలు వేశారు. ఈ ఏడుగురిలో అరుణ, హనుమాన్‌సింగ్ దంపతుల మూడు నెలల పాప చనిపోయింది. టీకా వేసిన మూడు గంటల సమయంలోనే పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో సుదర్శన్, డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ , వైద్య సిబ్బంది శివలాల్ తండాకు చేరుకున్నారు. చిన్నారి ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లు గమనించిన వారు, నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఒకే వ్యాక్సిన్ బాటిల్ నుంచి ఏడుగురికి టీకాలు వేశామని, మిగతా ఆరుగురు చిన్నారులు బాగున్నారని, ఈ పాపనే చనిపోయిందని, పాప చనిపోవడానికి కారణం ఏమై ఉంటుందని పోస్టుమార్టం నివేదికలో తెలుస్తుందని డీఎంహెచ్‌వో సుదర్శనం తెలిపారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...