గ్రామాల్లో కొనసాగుతున్న హరితహారం


Sun,August 11, 2019 01:02 AM

మాక్లూర్ : మండంలోని డీకంపల్లి, మాదాపూర్, చిన్నాపూర్, ముల్లంగి(బి) గ్రామాల్లో శనివారం ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. డీకంపల్లి మొక్కలు నాటిన అనంతరం సర్పంచ్ సవిత మాట్లాడారు. అధికారులు ఇచ్చిన 40 వేల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గ్రామస్తులు సహకారం అందించాలన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ఎదుట 2 నుంచి 6 మొక్కలు నాటాలని కోరారు. మొక్కల పెంపకంతోనే మానవాళికి మనుగడ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కాలగడ్డ గంగామణి, ఉప సర్పంచ్ రామారావు, నాయకులు సాధుల భోజన్న, దేవన్న, కార్యదర్శి, ఈజీఎస్ ఎఫ్‌ఏ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

విధిగా మొక్కలు నాటాలి
నందిపేట్ రూరల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విధిగా మొక్కలు నాటాలని నందిపేట్ ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లక్ష్యం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...