కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి


Sat,August 10, 2019 02:05 AM

నిజామాబాద్ రూరల్ : గుండారం గ్రామపెద్ద చెరువును కొందరు ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం సర్పంచ్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామానికి ప్రధాన నీటి వనరు అయిన పెద్ద చెరువును కబ్జా చేసి గుట్టుచప్పుడు కాకుండా అందులో నిర్మాణ పనులు చేపడుతున్నారని అన్నారు. గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్, ఉపసర్పంచులు కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి, గ్రామపెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...