జిల్లా జైలును సందర్శించిన విద్యార్థులు


Sat,August 10, 2019 02:04 AM

నిజామాబాద్ రూరల్: జిల్లా జైలును గూపన్‌పల్లి పదో తరగతి విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో మహాకవి దాశరథి జైలుశిక్ష అనుభవించిన బ్యారక్ నంబర్ 8లో విద్యార్థులు గడిపారు. తమ పాఠ్య పుస్తకాల్లో ఉన్న కవి చరిత్రాత్మక స్మృతులు తెలుసుకోవడం ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. వేల సంవత్సరాల కింద కట్టిన కోట, రామాలయం, రఘునాథ చెరువు, దాశరథి జైలు శిక్ష అనుభవించిన చోటు జిల్లాకున్న చారిత్రక సంపద అని తెలుగు ఉపాధ్యాయుడు ఘనపురం దేవేందర్ విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఆదర్శ్, ఆర్తీశ, కావ్య, రితీశ, నర్సింహ, సందీప్, లావణ్య, శ్రీజ, నాగలక్ష్మి, లక్ష్మణ్ స్వామి, షాహిన్, రవళి, మధు, సాయికుమార్, రామకృష్ణ, మౌనిక, రాకేశ్, మాధురి, లక్ష్మీప్రసన్న, జి.సాయికుమార్, జి.శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...