జిల్లాకు వాల్‌మార్ట్ రావడం సంతోషకరం


Thu,July 18, 2019 04:25 AM

ఖలీల్‌వాడి / నిజామాబాద్ రూరల్ : రాష్ట్రం లో విస్తరణ ప్రణాళికలు కొనసాగిస్తున్న వాల్‌మార్ట్ ఇండియా సంస్థ నిజామాబాద్ జిల్లాకు రా వడం సంతోషంగా ఉందని నిజామాబాద్ అర్బ న్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం నగరంలోని మాధవనగర్ సమీపంలో 56వేల చదరపు మీటర్లలో ఏర్పాటు చేసిన వాల్‌మార్ట్ స్టోర్ బెస్ట్‌ప్రైజ్ ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, కలెక్టర్ రామ్మోహన్‌రావు, వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈవో క్రిష్ అయ్యర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. భారతదేశంలో ఇది 26వ స్టోర్, రాష్ట్రం లో మూడోది కావడం విశేషమన్నారు. నిజామాబాద్ నగరంలోని కిరాణా దుకాణాదారులు, రీసెల్లర్లు, హోట ళ్లు, రెస్టారెంట్లు, ఆయా సంస్థల చిన్న వ్యాపారవేత్తలు విస్తృత శ్రేణిలోని ఉత్పాదనలను పోటీదారుల ధరల కంటే లాభాదాయకమైన ధరలతో నా ణ్యమైన ఉత్పత్తులను వాల్‌మార్ట్‌లో లభిస్తాయని తెలిపారు. నిజామాబాద్‌లో స్థాపించడంతో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ప్రపంచంలో పేరు పొందిన వాల్‌మార్ట్ అమెరికాలో చూశానని, నిజామాబాద్‌కు రావడం సం తోషంగా ఉందని, నిజామాబాద్‌కు వస్తుందని ఊహించలేదని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పేర్కొన్నా రు. ఇంత పెద్ద షోరూం నాలుగు వేలకు పైగా వ స్తువులు ఎమ్మార్పీలో డిస్కౌంట్‌తో విక్రయించ డం అభినందనీయమన్నారు.

కిరాణా దుకాణాదారులు, చిన్న వ్యాపారులు విజయవంతం అ య్యేందుకు వాల్‌మార్ట్ ఉపయోగపడుతుందని తెలిపారు. స్థానిక రైతాంగానికి మద్దతుగా నిలవ డం సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో వాల్‌మార్ట్ ఇండియా ఇప్పటికే రెండు స్టోర్‌లను హైదరాబాద్, కరీంనగర్‌లో ఏర్పాటు చేసిందని, నిజామాబాద్ లో మూడో స్టోర్ ఏర్పాటు చేశారన్నారు. కలెక్టర్ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ అంతర్జాతీయ వాల్‌మార్ట్ ప్రారంభించడంతో సామాన్య ప్రజలు తక్కువ ధరకు వినియోగ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం లభించిందని తద్వారా ఆర్థికం గా వెసులుబాటు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ కార్తీక్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, ఇందిర, సుజాత, మాజీ మేయర్ ఆకుల సుజాత, మాజీ కార్పొరేటర్ విశాలినీరెడ్డి, వాల్‌మార్ట్ సిబ్బంది విశాల్ కుమార్ పాల్గొన్నారు.

157
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...