భూగర్భ జలాలను కాపాడుకుందాం


Wed,July 17, 2019 06:13 AM

ఆర్మూర్ రూరల్ : వర్షపు నీటిని ఒడిసి పట్టి అడుగంటి పోతున్న భూగర్భ జలాలను కాపాడుకుందామని కలెక్టర్ రామ్మోహన్‌రావు పిలుపునిచ్చారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులకు వ్యవసాయశాఖ, రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన కలెక్టర్ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని 256 జిల్లాల్లో జూలై 1 నుంచి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. భవిష్యత్తులో సాగు,తాగు నీటికి ఇబ్బందులు రాకుండా వర్షపు నీటిని చక్కగా వినియోగించుకొని భూగర్భ జలాలు పెంపొందించేలా చర్యల్లో భాగంగా వనరులను ఉపయోగించుకొని ముందుకు పోవాలన్నారు. ఈ యజ్ఞం ఒక్క అధికార యంత్రాంగంతోనే సాధ్యం కాదని, ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు అందరి సమష్టి కృషి ఉంటేనే విజయం సాధిస్తామని అందుకు ప్రతి ఒక్కరూ జలశక్తి అభియాన్‌లో భాగస్వాములు కావాలన్నారు. రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిచేందుకు మెట్ట భూములు ఆరుతడి పంటలు వేసుకోవాలని, పంట మార్పిడి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా వర్షాపాతం బాగా పడిపోయిందన్నారు. నీటి రక్షణ పొదుపుపై అవగాహన పెంచుకోవాలని కోరా రు. కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ సమన్వయ కర్త డాక్టర్ ఆర్‌వీఐ బాలాజీ నాయక్ మాట్లాడుతూ నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు, కందకాలు, ఉట కందకాలు నిర్మించుకోవాలన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ నవీన్, డీఆర్డీవో రమేశ్ రాథోడ్ నీటి సంరక్షణలో భాగంగా జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం కింద నీటి సంరక్షణ, పాత చెరువులు, ఇంకుడు గుంతల పూడికతీతపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో నీటి నిలువ, వాటి సంరక్షణ ప్రత్యేకించి తాగునీటికి ఇంకుడుగుంత, ప్రతిరైతు పొలంలో ఒక ఫాంపాండ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్స య్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ మోహన్ రెడ్డి, ఏటీఎంఏ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, గ్రౌండ్ వాటర్ అధికారి ప్రసాద్, డీహెచ్‌ఎస్‌వో నర్సింగ్ దాస్, డీఏఏటీటీసీ నవీన్ కుమార్, ఆ ర్మూర్ తహసీల్దార్ రాణాప్రతాప్ సింగ్, ఎంపీడీవో గోపిబాబు, వ్యవసాయశాఖ అధికారి హరికృష్ణ పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...