మార్కెట్‌లో విరాళాల సేకరణ


Mon,July 15, 2019 02:36 AM

శక్కర్‌నగర్‌: బోధన్‌ పట్టణంలో ఈ నెల 19, 20వ తేదీల్లో నిర్వహించే ఊర పండగ సందర్భంగా ఆరెత్తే కార్యక్రమాన్ని ఆదివారం పండగ కమిటీ ప్రతినిధులు, పెద్దలు కొనసాగించా రు. పట్టణంలోని నడి ఊరు నుంచి భాజాభజంత్రీలతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వెళ్తూ వ్యాపా రులు, వర్తకుల నుంచి విరాళాలు సేకరించారు. పట్టణంలోని ఐదు తర్పలకు చెందిన ప్రతినిధులు, గ్రామపెద్దలు కలిసి పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో పర్యటించారు. కార్యక్రమంలో ఐదు తర్పలకు చెందిన పెద్దలు బండారు పోశెట్టి, గుమ్ముల అశోక్‌రెడ్డి, రుద్ర సత్యనారాయణ, జెల్ల లక్ష్మణ్‌, ఉద్మీర్‌ సాయిలు, పలువురు గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
20న విద్యాసంస్ధలు, వ్యాపార సంస్థలు బంద్‌ పాటించాలి
బోధన్‌ పట్టణంలో నిర్వహించే ఊరపండగ సందర్భంగా ఈ నెల 20న పట్టణంలోని విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు బంద్‌ పాటించాలని పండగ కమిటీ ప్రతినిధులు కోరారు. 20వ తేదీన పండగ చివరి రోజు కావడంతో ఈ బంద్‌ను పాటించాలని సూచించారు. ఈ విషయంలో రెండురోజుల ముందుగా వ్యాపా రస్తులకు, వర్తకులకు మరోమారు విన్నవిస్తామన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...