డీఆర్డీవో కక్షసాధింపు


Sun,July 14, 2019 12:54 AM

నిజామాబాద్/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రమేశ్ రాథోడ్ తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఏపీవోలు కలెక్టర్ రామ్మోహన్‌రావుకు ఫిర్యాదు చేశారు. మహిళా అధికారులని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, అనుచితంగా ప్రవరిస్తున్నారంటూ ఆయనపై సదరు ఏపీవోలు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. ఈ మేరకు నలుగురు మహిళా ఏపీవోలు ఫిర్యాదు పత్రంలో తమ సంతకాలను చేసి కలెక్టర్‌కు సమర్పించారు. అనంతరం ఈ విషయాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. మంత్రి ముందు వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపడతామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. నలుగురు మహిళా ఏపీవోలు ఇచ్చిన ఫిర్యాదులో ఏమున్నదంటే.. డీఆర్‌డీవో తన స్వార్థ ప్రయోజనాల కోసం వివిధ మండలాల్లో మహిళా ఏపీవోలను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఆయన మాటలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాం. ఉపాధి హామీ పనులపై శ్రద్ధ పెట్టకలేకపోతున్నాం. అందుకే ఉపాధి హామీ పనులు ప్రగతి ఆగిపోతున్నది. మహిళా ఏపీవోలను టార్గెట్ చేసి బదిలీ చేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కార్యాలయ సిబ్బంది నర్సింహులు (హెచ్‌ఆర్), గంగాధర్ (ప్లాంటేషన్ మేనేజర్) వీరిద్దరూ మహిళా ఏపీవోలపై పీడీకి లేనిపోనివి చెప్పి తప్పుదోవ పట్టించారు. దీంతో పీడీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఈ సిబ్బంది ఉపాధి హామీ పథక నిరోధకులుగా మారారు. మా ఆవేదనను ఆలకించి మాకు న్యాయం చేయండని నలుగురు ఏపీవోలు ఫిర్యాదులో కోరారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...