ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం.. పర్యావరణాన్ని సంరక్షిద్దాం..


Sat,July 13, 2019 04:33 AM

కోటగిరి : ప్లాస్టిక్ వాడడంతో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ప్లాస్టి క్‌ను నిషేధించి పర్యావరణాన్ని సంరక్షిద్దామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పొలాస కళాశాల విద్యార్థినులు అన్నారు. అధ్యయనంలో భాగంగా పొలాస కళాశాల నుంచి ఐదుగురు విద్యార్థులు శుక్రవారం ఎత్తొండ గ్రామానికి వ చ్చారు. ఆరు నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల సాగు, మెళకువలు, సాగు పద్ధతుల గురించి అధ్యయనం కోసం బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనలియర్ విద్యార్థిను లు వచ్చారు. ఎత్తొండ ప్రభుత్వ ఉన్నత పా ఠశాల ఆవరణలో అంతర్జాతీయ ప్లాస్టిక్ నిషేధ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల విద్యార్థిని మానస మాట్లాడుతూ.. ప్లాస్టిక్ బ్యాగులు వాడడంతో కలిగే నష్టాల గురించి వివరించారు. ప్లాస్టిక్ కవర్లు భూమిలో కుళ్లిపోవని, అవి నాశనం అవడానికి సుమారు 1000 సంవత్సరాలు పడుతుందన్నారు. పంట భూమి కలుషితమై దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. ప్లాస్టిక్ కవర్లు పశువులు తింటే అనారోగ్యానికి గురవుతాయన్నారు. ప్లాస్టి క్ కాల్చడంతో అనేక రసాయనాలు గాలి లో కలిసి గాలి కలుషితం అవుతుందన్నా రు. పేపరు బ్యాగులు వాడడం ఎంతో మే లన్నారు. మనం వీలైనంత వరకు ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించి పేపర్ బ్యాగులు, కవర్ల్ల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం కళాశాల విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, నగేశ్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు శానం సాయిలు, ఉపాధ్యాయులు ఉమానంద్, గంగారాజు, శ్వేత, సుజాత, మండవ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...