భూమి అమ్మిన డబ్బులు ఇవ్వాలని బాధిత కుటుంబీకుల ఆందోళన


Sat,July 13, 2019 04:32 AM

నిజామాబాద్ రూరల్ : రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గంగస్థాన్ ప్రాంతంలో పృథ్వీ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రామకృష్ణరావు ఇంటి ఎదుట డిచ్‌పల్లి మండలంలోని ధర్మారం(బీ) గ్రామానికి చెందిన నాగమహేశ్వర్‌రావు కుటుంబీకులు ఆందోళనకు దిగారు. తాము భూమి అమ్మిన డబ్బులు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడాన్ని నిరసిస్తూ శుక్రవారం బాధిత కుటుంబీకులు క్రిమిసంహారక మందు, పెట్రోల్ బాటిళ్లను వెంట తెచ్చుకుని బైఠాయించారు. తాము అమ్మిన భూమికి ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమి డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు. డబ్బులు ఇవ్వకపోగా తమను దూషించాడని బాధితులు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు రావల్సిన భూమి డబ్బులు చెప్పిన సమయానికి ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు భూమి డబ్బులు ఇవ్వాల్సిన రామకృష్ణరావుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో ప్రభాకర్ తెలిపారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...