సభ్యత్వ నమోదుకు సకల జనుల స్పందన


Thu,July 11, 2019 01:28 AM

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సకల జనుల నుంచి మంచి స్పందన లభిస్తోందని మార్క్‌ఫెడ్ చైర్మన్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి లోక బాపురెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదుకు స్వచ్ఛందంగా లభించిన స్పందనకు కేసీఆర్ జనరంజక పాలన ప్రధాన ప్రేరణ అన్నారు.మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన అభివృద్ధి, వారి సేవల ఫలితంగా టీఆర్‌ఎస్ సభ్యత్వం పొందడానికి అన్నివర్గాల వారు ఉత్సాహం చూపారని తెలిపారు.సభ్యత్వ నమోదు విజవంతంగా సాగుతున్న నేపథ్యంలో ఆయనను నమస్తే తెలంగాణ పలకరించింది.ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు.

నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు స్పందన ఎలా ఉంది.. ?
మార్క్‌ఫెడ్ చైర్మన్ : అద్భతమైన స్పందన లభించింది.అన్నివర్గాల వారు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని గుర్తు చేస్తూ మరీ సభ్యత్వం తీసుకున్నారు.సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచే గ్రామాలు, పట్టణాల్లో ప్రజల నుంచి ప్రత్యేక ఆసక్తి, స్పందన కనబడింది.

సభ్యత్వ నమోదుకు ఇంతలా స్పందనకు కారణాలు..?
తాము టీఆర్‌ఎస్ సభ్యత్వం కలిగి ఉండాలనే భావన సకల జనాల్లో ఉంది.ఈ డ్రైవ్‌లోనూ అది పునరావృతమైంది.సీఎం కేసీఆర్ జనరంజక పాలన ఇందుకు ప్రధాన ప్రేరణ.మనిషికి తల్లి కడుపులో బిడ్డగా ఉన్నప్పటి నుంచి మొదలుకొని జీవితంలో ఏదో దశలో ఎలాంటి సంక్షేమం అవసరం ఉంటుందో గుర్తించి, అదే విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, రైతుబీమా, 24గంటల కరెంటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, పేద వర్గాల పిల్లలకు గురుకుల పాఠశాలలు, ఇంటింటికీ శుద్ధమైన తాగునీటిని అందించే మిషన్ భగీరథ,తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ర్టాల ప్రభుత్వాలు ఈ పథకాలను ఆదర్శంగా తీసుకొని అమలుకు పూనుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి సీఎం అధినేతగా ఉన్న టీఆర్‌ఎస్ సభ్యత్వం కలిగి ఉండడాన్ని ప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు.

సభ్యత్వ నమోదు ఎంత వరకు వచ్చింది ?
విజయవంతమైంది.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సభ్యత్వ నమోదుపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.ఆయన ఆదేశాలు,సూచనలు పాటిస్తూ పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదులో లక్ష్యాలను సాధించాయి. అధిష్టానం ఇచ్చిన లక్ష్యం మేరకు సభ్యత్వ నమోదు పూర్తయ్యింది. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో 50వేల చొప్పున సభ్యత్వ నమోదుకు గానూ బుధవారం ఉదయం నాటికి 90శాతం పూర్తయ్యింది.

రూ.2 లక్షల బీమా సౌకర్యంపై ఎలాంటి స్పందన కనిపించింది..?
పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తల సంక్షేమాన్ని, భద్రతను గుర్తిస్తారు. ఆయన ఉద్యమ నాయకుడిగా, సీఎంగా టీఆర్‌ఎస్ కార్యకర్తల కష్ట సుఖాలు స్వయంగా చూశారు. రాష్ట్ర సాధన కోసం నాడు, బంగారు తెలంగాణ కోసం నేడు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ సైనికుల్లా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలకు దురదృష్టవశాత్తు జరగకూడనిది జరిగితే వారి కుటుంబానికి తగిన ఆర్థిక భద్రత,స్వాంతన లభించే అవకాశం ఉండాలనే గొప్ప ఉద్దేశంతో ఏ పార్టీ కల్పించని విధంగా రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పించారు.దీనికి సహజంగానే మంచి స్పందన ఉంది.

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ప్రభావం ఉంది ?
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు అత్యంత సానుకూలాంశాలు అవే.మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడుగా తనదైన మార్కుతో అభివృద్ధి చేసి చూపించారు.ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ఫలితాలు ఆగస్టు మొదటి వారంలో అందనున్నాయి.జిల్లాకు కాళేశ్వరం జలాలు అందించే పనులను త్వరగా పూర్తి చేయించడంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేకంగా నిరంతరం కృషి చేస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను ముందుగా అందుకోబోతున్నది ఎస్సారెస్పీ. వరద కాలువ, కాకతీయ కాలువల వెంట తూములు, లిఫ్టుల ద్వారా నీరు అందనుంది.వీటితో బాటు ఆసరా పింఛన్లు, ప్రత్యేకంగా బీడీ కార్మికులకు జీవనభృతి, వ్యవసాయ ప్రాంతమైనందున రైతుబంధు పథకం,తదితర పథకాల లబ్ధ్దిని అందుకుంటున్నారు. ఈ సంతోషంతో సభ్యత్వంపై స్పందన చూపించారు.

పసుపు బోర్డు, మద్దతు ధరపై రైతుల స్పందన ఎలా ఉంది ?
బీజేపీ ప్రభుత్వం, నాయకులు తమను వంచించారని రైతులు భావిస్తున్నారు.సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో రైతుల నుంచి ఈ రకమైన నిరాశ, బాధ వ్యక్తమైంది. కేంద్ర బడ్జెట్‌లో పసుపు బోర్డు ప్రస్తావన కూడా లేకుండా పోవడంతో బీజేపీ నేతల మాటలు వట్టివేనని రైతులు స్పష్టతకు వచ్చారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...