కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం


Wed,July 10, 2019 03:09 AM

డిచ్‌పల్లి, నమస్తే తెలంగాణ : కాళేశ్వరం ప్రాజెక్టుతో రానున్న రోజుల్లో తెలంగాణ సస్యశ్యామలం కానుందని నిజామాబా ద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని కేఎన్‌ఆర్ గార్డెన్‌లో నియోజకవర్గంలో ని ఏడు మండలాలకు చెందిన 726 మంది లబ్ధిదారులకు రూ.7.11 కోట్ల విలువైన చెక్కులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి సాగు, తాగునీటి వెతలు తీర్చడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తుంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు నిత్యం కేసీఆర్‌పై విమర్శించడం తగదన్నారు. అభివృ ద్ధి చేస్తే సంతోషించా లి తప్ప విమర్శలు చేయడం తగదని హి తవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మా ణం పూర్తయితే నిజామాబాద్ రూరల్ ని యోజకవర్గంలో ఏ డు మండలాలకు సా గునీరు అంది బీడు భూములన్నీ సాగులోకి వస్తాయన్నారు. ఇప్పటికే జక్రాన్‌పల్లి, ధర్పల్లి మండలాల్లో పైప్‌లైన్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. మంచిప్ప మాసానితో పాటు రామడుగు ప్రాజెక్టుకు ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. మంచిప్ప ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పైప్‌లైన్ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ రూ. 2,600 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడం బాధాకరమన్నారు. ఎంపీగా కవిత గెలిచి ఉంటే పార్లమెంట్‌లో ఝాన్సీరాణిలా పోరాటం చేసి తెలంగాణకు నిధులు తెచ్చేవారని గుర్తుచేశారు. ఎంపీగా గెలిచిన నాయకులు ఇటీవల జరిగిన బడ్జెట్‌లో ఎలాంటి నిధులు తేకపోవడం వారి అసమర్ధతను తెలియజేస్తుందని విమర్శించారు. కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరం లాంటిదని, ఈ పథకం ద్వారా ఎందరో నిరుపేదలు లబ్ధిపొందుతున్నారన్నారు. పెద్దన్న రూపంలో కేసీఆర్ కట్నం కింద లక్షా 116 రూపాయలు అందించి వారికి బాసటగా నిలుస్తున్నారని తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో ప్రతినెల ఆసరా పింఛన్ల రూపంలో 65వేల మంది లబ్ధిపొందుతున్నారని, అనేక పథకాలను సీఎం కేసీఆర్ ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందని, అక్కడ తాగడానికి నీళ్లు, నడవడానికి రోడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీపీలు గద్దెభూమన్న, రమేశ్ నాయక్, నల్లసారిక, లత, దీకొండ అనిత, అనూష, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్మోహన్, దాసరి ఇందిర, సుమనారెడ్డి, తనూజ శ్రీనివాస్‌రెడ్డి, మాన్‌సింగ్, కమల, పార్టీ మండల అధ్యక్షులు శక్కరికొండ కృష్ణ, నల్లహన్మంత్‌రెడ్డి, నట్టభోజన్న, ముస్కె సంతోష్, ముత్యంరెడ్డి, స్థానిక సర్పంచ్ కులాచారి సతీశ్‌రావు, వైస్ ఎంపీపీ కులాచారి శ్యామ్‌రావు, శక్కరికొండ కవిత, తహసీల్దార్ అ య్యప్ప, ఎంపీడీవో మర్రిసురేందర్,ఆర్‌ఐ భరత్ తదితరులు పాల్గొన్నారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...