వరి రైతుకు దక్కిన మద్దతు


Wed,July 10, 2019 03:08 AM

నిజామాబాద్ సిటీ : జిల్లాలో ఈ యాసంగి(రబీ)లో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. జిల్లావ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలుకు సంబంధించిన డబ్బులను సకాలంలో రైతులకు చెల్లించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 295 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,65,546.800 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రూ. 644.36 కోట్లను రైతులకు చెల్లించారు. దీంతో రైతులకు ఎలాంటి డబ్బుల చెల్లింపులు పెండింగులో లేవని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు..
జిల్లాలో ప్రభుత్వం వరి ధాన్యానికి సంబంధించిన డబ్బులను పెండింగ్ లేకుండా చెల్లింపులు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకే రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతులకు డబ్బుల చెల్లింపులు పూర్తిచేసింది. గత మూడు నెలలుగా కొనుగోలు ప్రక్రియతో పాటు డబ్బుల చెల్లింపులు చేశారు. ఈసారి ప్రభుత్వం దళారీ వ్యవస్థను పూర్తిగా అరికట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర వచ్చే పరిస్థితి లేకపోవడంతో పాటు మోసపోయిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వం దళారుల వ్యవస్థను ప్రోత్సహించడంతో రైతులకు మద్దతు ధర లభించక ఆర్థికం గా నష్టపోయారు. అంతే కాకుండా రైతుల నుంచి కొనుగో లు చేసిన దళారులు డబ్బుల ఇవ్వకుండా మోసం చేసిన సం ఘటనలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో రైతుల పడ్డ కష్టా లు అంతా ఇంత కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు పూర్తిగా తొలిగిపోయాయి. ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులను చెల్లింపులు చేసింది. అంతే కాకుండా దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతులు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారుల పర్యవేక్షణలో రైతుల నుంచి కొనుగోలు ప్రక్రియ జరిపింది.

రైతుబంధుతో పెరిగిన వరి సాగు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంతో జిల్లాలో వరి సాగు పెరిగింది. ప్రభుత్వం ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందించడంతో సకాలంలో రైతులు పంటలు సాగు చేసుకొని అధిక దిగుబడి సాధించారు. 2017-18 సంవత్సరంలో యాసంగి(రబీ)లో రైతుల నుంచి 2,99,281.800 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం రికార్డుస్థాయిలో 295 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,65,546.800 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ. 644.36 కోట్లను రైతులకు చెల్లించారు. గత యాసంగి(రబీ) సిజన్ కంటే ఈ ఏడాది 66,265 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని అధికంగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే ప్రభుత్వం రైతులకు సకాలంలో రైతుబంధు డబ్బుల చెల్లింపులు, రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రాయితీపై పంపిణీ చేయడం, 24 గంటల నిరంతరం కరెంటు సరఫరా తదితర సదుపాయాలు ప్రభుత్వం రైతులకు కల్పించడంతో ఇది సాధ్యమైంది. పంటల సాగు పెరగడంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...