భూసారానికి తగిన ఎరువులు వాడాలి


Sun,July 7, 2019 01:23 AM

ఆర్మూర్ రూరల్ : రానున్న రోజుల్లో సాగు భూమిలో సారానికి అనుగుణంగానే ఎరువులు, పోషకాలు వేయాల ని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవిందు అన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామంలో భూసార పరీక్షలపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ.. ప్రతి రైతు తన సాగు భూమిపరీక్షలను విధిగా చేయించుకొని దానికి అనుగుణంగా సూచించిన ఎరువులను, పోషకాలను, సేంద్రియ ఎరువులను పంటలకు అనుగుణంగా వాడాలని సూచించారు. తద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా, పంటలను ఆశించే చీడపీడల ఉధృతి కూడా తగ్గించవచ్చన్నారు. జాతీయ సుస్థిర వ్యవసాయ పథకంలో భాగంగా రాంపూర్ గ్రామ రైతులకు వ్యవసాయక్షేత్రాల్లో సుమారు 109 భూ సార పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాల విశ్లేషణ, వేయాల్సిన ఎరువులు, పోషకాలమోతాదులను మండల వ్యవసా య అధికారి హరికృష్ణ వివరించారు. ప్రభుత్వం అందించే వ్యవసాయ సంబంధిత పథకాలు రైతులకు తెలిపారు. ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.నవీన్ కుమార్ భూ పరీక్షల్లో ఇచ్చిన ఫలితాలను విశ్లేషించారు. రైతులకు పోషకాలు, నేల స్వభావం, తదనుగుణంగా చేపట్టవలసిన ఎరువుల యాజమాన్యం, వివిధ పంటల్లో అవలంభించాల్సిన పద్ధతుల గురించి విపులంగా వివరించారు. క్షేత్ర సందర్శనలో భాగంగా మొక్కజొన్న పంటలో కత్తెరపురుగు నివారణకు ముందస్తు జాగ్రత్తలు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ దయానంద్ బంటు, ఉప సర్పంచ్ గంట గంగాధర్, రైతు సమన్వయ సమితి సభ్యులు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారి కుమారి పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...