సంఘాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి


Sun,July 7, 2019 01:23 AM

బోధన్ రూరల్: మహిళ సంఘాలకు సంబందించి వివరాలు అన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరుగుతుందని డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్ట్ మనేజర్ నూకల శ్రీనివాస్ అన్నారు. శనివారం బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో డిజిటల్ అకౌంట్ విధానంపై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హజరై ఐకేపీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ అకౌంట్ విధానంపై మహిళ సంఘాల వ్యయ, జమ , ఖర్చులను, రుణాలను , తీసుకున్న వివరాలు అన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. దీంతో మహిళ సంఘాలు పని తీరు ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చన్నారు. దీంతో ఏ విధంగా నిధులు కేటాయించాలని తెలిసిపోతుందన్నారు. జిల్లాల్లో మొత్తం 22730 మహిళ సంఘాలు, 2 లక్షల 29 వేల 551 సంఘంలో సభ్యులు ఉన్నారన్నారు ఈ సంఘాలకు పని తీరు ఎక్కడ నుంచి అయిన చూడవచ్చు అన్నారు. ఈ ఆన్‌లైన్ ద్వారా మహిళ సంఘల గ్రేడింగ్ విదానంను తెలుసుకోవచ్చన్నారు. దీంతో మహిళ సంఘాల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. వీటి సహయంతో గ్రామాల్లోన్ని చిన్న,సన్నా సంఘాల అంతర్గత అప్పులు, రుణాల వివరాలు కుటుంబ జీవనోపాదనలు వివరాలకు సంబందించి ఆన్‌లైన్‌లో పోందుపర్చాలని సూచించారు. బోధన్ ఐకేపీ ఏపీయం వేంకటేశం, గంగారంతో పాటు వీవోఏఎస్‌లు ఉన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...