10 నుంచి ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు


Sun,July 7, 2019 01:21 AM

నిజామాబాద్ సిటీ : ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 10, 12,17వ తేదీల్లో నగరంలోని పాత అంబేద్కర్ భవన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10న నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్‌పల్లి, ధర్పల్లి, ఇందల్‌వాయి, మాక్లూరు, సిరికొండ, నవీపేట్, 12న ఆర్మూర్ రూరల్, అర్మూర్ అర్బన్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, కమ్మర్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్, ఏర్గట్ల, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, నందిపేట్, 17న బోధన్ రూరల్, బోధన్ అర్బన్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్ని, రుద్రూర్ పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలతో హాజరుకావాలని అధికారులు ప్రకటనలో తెలిపారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...