నేడు జడ్పీ పాలకవర్గ ప్రమాణస్వీకారం

Fri,July 5, 2019 04:13 AM

నిజామాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం నేడు కొలువుదీరనుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు నూతనంగా ఎన్నికైన జడ్పీ సభ్యుల చేత కలెక్టర్ రామ్మోహన్‌రావు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నేడు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభ్యులు పదవీకాలం ప్రారంభంకానుంది.

టీఆర్‌ఎస్ ప్రభంజనం...
మే నెలలో మూడు విడతలుగా నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక జడ్పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకున్నది. జిల్లాలో 27 జడ్పీటీసీ స్థానాలకు గాను 23 టీఆర్‌ఎస్ గెలుచుకోగా.. కాంగ్రెస్ 2, బీజేపీ 2 స్థానాలతో సరిపెట్టుకుంది. మాక్లూర్ నుంచి ఏకగ్రీవ జడ్పీటీసీ ఎన్నికైన దాదన్నగారి విఠల్‌రావును టీఆర్‌ఎస్ అధిష్టానం జడ్పీ చైర్మన్‌గా ఖరారు చేసింది. ఎడపల్లి జడ్పీటీసీ సభ్యురాలు రజితా యాదవ్‌కు వైస్ చైర్‌పర్సన్‌గా ఖరారు చేసింది. జడ్పీ పాలకవర్గం తొలి సమావేశానికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.

ఉమ్మడి జిల్లాలో...
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 36 మంది జడ్పీ సభ్యులతో ఏర్పడిన జిల్లా పరిషత్ పాలకవర్గం నిన్నటి వరకు కొనసాగింది. 2016, అక్టోబర్ 11న కొత్త జిల్లాల ఆవిర్భావంతో భౌగోళిక మార్పులు, చేర్పులు అనేకం చోటుచేసుకున్నాయి. మండలాల ఏర్పాటు, కొత్త గ్రామ పంచాయతీల ఆవిర్భావంతో ఉమ్మడి జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. మండలాల సంఖ్య, గ్రామాల సంఖ్య పలు చోట్ల భారీగా పెరిగింది. మేజర్ పంచాయతీలు ఏకంగా మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందాయి. తండాలు సైతం పంచాయతీలుగా మారాయి. ఇలా కామారెడ్డి జిల్లా 22 మండలాలతో పురుడు పోసుకుంది.

అధికారాలు, విధులు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది గ్రామాలకు సుపరిపాలనను అందించేందుకు కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకు వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాత చట్టానికి సవరణలు చేసి పంచాయతీ రాజ్ చట్టం -2018 అమల్లోకి తెచ్చారు. సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన ఈ చట్టం గ్రామాలకు కొత్త ఊపిరిని పోసేలా ఉంది. నూతన చట్టం ప్రకారం గ్రామ స్వరాజ్యం దిశగా పల్లెలు అడుగులు వేయబోతున్నాయి. ఇందులో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీల ప్రాధాన్యతలను వారి బాధ్యతలను, విధులను విస్తరింపజేశారు. కొత్త చట్టం ప్రకారం నూతన గ్రామాలు, మండలాలు ఏర్పాటు చేసి వాటికి పరిషత్ ఎన్నికలు జరిపించారు. ఫలితంగా కొత్త జిల్లాల ప్రకారం నేటి నుంచి జిల్లా పరిషత్‌లు మనుగడ సాధించనున్నాయి.

ఎంపీటీసీల అధికారాలివీ...
ఎంపీటీసీగా ఎన్నికైన సభ్యుడు మండల పరిషత్ సభ్యుడిగా కొనసాగుతారు. వీరు మండల పరిషత్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది. మెజార్టీ సభ్యులు మద్దతు ఉన్న వారు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ప్రతి 90 రోజులకోసారి నిర్వహించే మండల పరిషత్ సమావేశాలకు వీరు హాజరవ్వాలి. ఎంపీటీసీ సభ్యుడి పరిధిలో ఉన్న గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవచ్చు. వరుసగా మూడు సార్లు సమావేశాలకు హాజరు కాకుంటే వారి సభ్యత్వం రద్దు చేస్తారు. ఎంపీటీసీ సభ్యుడు తమ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. గ్రామాల అభివృద్ధికి సూచనలు, సలహాలు చేయవచ్చు. అభివృద్ధి పనుల్లో ఏమైనా అక్రమాలు చోటుచేసుకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. మండల పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలలు తదితర ప్రభుత్వ సంస్థలకు వెళ్లి పరిశీలన, తనిఖీ చేసే అధికారం ఉంది. ప్రభుత్వం కల్పిస్తోన్న సంక్షేమ ఫలాలు అర్హులకు చేరేలా చూడవచ్చు.

జడ్పీటీసీల విధులు ఇలా...
జిల్లా పరిషత్ సమావేశాల్లో 1/3 !వంతు సభ్యులు రాత పూర్వకంగా సంతకాలు చేసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి జడ్పీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జడ్పీటీసీ సభ్యుడు మండల పరిధిలో జరిగే మండల పరిషత్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులు. జడ్పీ సమావేశాల్లోనూ మండల ప్రజల సమస్యలపై చర్చించి పరిష్కారం చేయవచ్చు. మండల పరిధిలో ప్రజా సమస్యలపై అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యులుగా చేసేలా ప్రోత్సహించాలి. మూడు నెలలకోసారి జరిగే జడ్పీ సర్వ సభ్య సమావేశాలకు హాజరు కావాలి. అన్ని జడ్పీ అధికారిక కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. జడ్పీ స్థాయి సంఘం సమావేశాలకు వచ్చే జడ్పీటీసీలకు ప్రత్యేక వసతి సౌకర్యం కల్పిస్తారు. జడ్పీ సమావేశాల్లో నిర్వహించే చర్చల్లో పాల్గొని సూచనలు చేసే అధికారం ఉంటుంది.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...