పోలీసు సిబ్బందికి శుభవార్త


Tue,June 25, 2019 02:49 AM

నిజామాబాద్ క్రైం: పోలీస్ సిబ్బందికి ఇక మీదట వారాంతపు సెలవును అ మలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్న ల్ ఇచ్చింది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది సంఖ్యను పరిగణనలోకి తీసుకొని వారంలో ఒక్కొక్కరికి ఒక్కోరోజు వారాంతపు సెలవు ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించుకోవాలని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు అన్ని జిల్లా అధికారులకు సూచనలు చేశారు. డ్యూటీ రోస్టర్ చార్ట్‌లో ఒక ప్రత్యేక కాలమ్‌ను పెట్టి, రోజుకు ఇద్దరు, ముగ్గురికి వారాంతపు సెలవు కేటాయించుకోవాలని ఆదేశించారు. ముందుగా సిబ్బందికి ఏ రోజు వారాంతపు సెలవు తీసుకొనేందుకు అనువుగా ఉంటుందో వారినే ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఏదైనా ఒక రోజుకు ఎక్కువ మంది సిబ్బంది సెలవు కోసం పోటీపడితే ఆ రోజు లాటరీ పద్ధతి ద్వారా సెలవులను కేటాయించాలన్నారు. మరో రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్‌స్టేషన్ల సిబ్బంది వారాంతపు సెలవుల కేటాయింపు పూర్తి చేసి, ఎవరు ఏ రోజు సెలవులో ఉంటారన్న సమాచారాన్ని సేకరించాలని జిల్లా పోలీస్ బాస్ కు ఆదేశాలు ఇచ్చారు. అయితే జిల్లా వ్యాప్తంగా హోంగార్డు స్థాయి నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వరకు ప్రతి ఒక్క సిబ్బందికి ఈ వారాంతపు సెలవులు వర్తించనున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వర్తించే 3,200 మంది సిబ్బంది వారాంతపు సెలవులు పొందే వారి జాబితాలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,800 మంది సిబ్బంది కా మారెడ్డి జిల్లా పరిధిలో 1,400 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ వారాంతపు సెలవులు పొందిన సిబ్బంది అనుకోకుండా ఏదైనా అత్యవసర సంఘటనలు జరిగితే విధులకు హాజరు కావాల్సి ఉం టుందన్నారు. అంతే కాకుండా కొంత మంది సిబ్బంది సిక్ లీవ్, లాంగ్ లీవ్ ఉన్నా, సంబంధిత ఠాణాలో తక్కువగా సిబ్బం ది ఉన్నా ఆసమయంలో విధుల్లో ఉన్న సిబ్బందికి వారాంతపు సెలవులు కేటాయించే బాధ్యత సంబంధిత ఏసీపీ, డీఎస్పీలదే తుది నిర్ణయమని అన్నారు. ఈ వారాంతపు సెలవులు కేటాయించడంపై సిబ్బంది కుటుంబాల్లో ఆనందం నెలకొంది.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...